రాసి పెట్టుకోండి.. ఆలియా జాయిన్ అయిందంటే ఆర్ ఆర్ ఆర్ సమ్మర్ కి రావడం పక్కా..!

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి ఫ్రాంఛైజీ భారీ స్థాయిలో రూపొందించినప్పటికి హీరోయిన్స్ గా మాత్రం టాలీవుడ్ లో కొన్నేళ్ళుగా సక్సస్ ఫుల్ సినిమాలు చేస్తూ ఉన్న అనుష్క శెట్టి, తమన్నా భాటియా లనే తీసుకున్నాడు. కాని ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కి మాత్రం రాం చరణ్ కి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ని, అలాగే ఎన్టీఆర్ కి జంటగా బ్రిటన్ మోడల్ ఒలియా మోరిస్ ఎంచుకున్నాడు.

Alia Bhatt turns down SS Rajamouli's RRR. This is why - Movies News

అయితే బాలీవుడ్ లో చలరేగిన డ్రగ్స్ వ్యవహారం, నెపోటిజం తో ఆలియా వచ్చి ఆర్ ఆర్ ఆర్ లో జాయిన్ అవడం అయ్యే పని కాదన్న టాక్ వినిపించింది. ప్రేక్షకులు కూడా చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ చేసి మరీ బాలీవుడ్ నుంచి ఆలియాని తీసుకు వచ్చి ఆర్ ఆర్ ఆర్ లో నటింప చేయడం కరెక్ట్ కాదన్న సందేహాలను వ్యక్తం చేశారు. కాని రాజమౌళి మాత్రం ఇవన్ని పట్టించుకోకుండా ఆర్ ఆర్ ఆర్ ని ప్రారంభించాడు.

అలాగే చెప్పినట్టుగానే ఈ నెల 22 న ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ టీజర్.. రామరాజు ఫర్ భీమ్ ని రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ టీజర్ విషయంలో రాజమౌళి బెదిరింపులకి గురి అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇవన్ని పక్కన పెడితే తాజా సమాచారం ప్రకారం ఆలియా ఆర్ ఆర్ ఆర్ కోసం నవంబర్ ఫస్ట్ వీక్ లో రానుందని సమాచారం.

నవంబర్ నుంచి నాన్ స్టాప్ గా ఆర్ ఆర్ ఆర్ లో పాల్గొని తన మీద ఉన్న సీన్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళుతుందని తెలుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ – రాం చరణ్ – ఆలియ భట్ మీద కీలక సన్నివేశాలున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఎన్టీఆర్ – రాం చరణ్ కలిసేది కూడా ఆలియా వల్లనే అని సమాచారం. ఇక జనవరి వరకు ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ చేసుకొని తిరిగి ముంబై చేరుకొని సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గంగూబాయ్’
సినిమా చిత్రీకరణలో పాల్గొంటుందట.