అక్కడ రక్తం ఇస్తే కేజీ ఉల్లిపాయలు ఫ్రీ అంట.. ఎక్కడ అంటే?

ఉల్లి ధరలు మళ్లీ ఘాటందుకున్నాయి. సామాన్యునికి అందనంత దూరానికి ఎగరబోతున్నాయి. ఇదివరకే ఉల్లి బాదుడుకు అందరికీ అందనంత దూరానికి వెళ్లిన సంఘతి తెలిసిందే. తాజాగా మళ్లీ ఉల్లి ఆ దశకు చేరుకోబోతోంది. ఈ తరుణంలో ప్రజలు తమ నిరసనను ఫన్నీగా వివిధ రకాలుగా తెలుపుతున్నారు. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి అవేంటో చదివేయండి..

బంగారం కంటే విలువైనది ప్రస్తుతం ఏదైనా ఉంది అంటే అది ఉల్లేనంటూ పలువురు మీమ్స్, ఫన్నీ వీడియోలను తీస్తున్నారు. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ పెళ్లిలో జంటకు ఉల్లిపాయల బొకేను కానుకగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అదే రాష్ట్రంలోని కడ్డలోర్ లో జరిగిన ఇంకొక పెళ్లిలో ఆ జంటకు రెండున్నర కిలోల ఉల్లిని అతిథులంతా కలిసి కానుకగా ఇస్తున్న బొకే సోషల్ మీడియాను నవ్వులో ముంచెత్తుతుంది.

ఆ గిఫ్టును చూసి పెళ్లివాళ్లంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా పెళ్లికొడుకు వెడ్డింగ్ ప్లానర్ చింతాన్ దీనికై జోకులు వేసుకున్నారు. ఫ్యామిలీ విందులో ఉల్లి రైతా పెట్టాలని అనుకున్నాము కాని ఉల్లి ధర ముండుతున్నందున చేయలేకపోయామని తెలిపారు. అందుకే పెళ్లి కొడుకు స్నేహితులతో ఈ బొకేను కానుకగా ఇప్పించామని వెడ్డింగ్ ప్లానర్ తెలిపారు.

అలాగే సూరత్ లో యువకులు వినూత్న నిరసనకు శ్రీకారం చుట్టారు. సహస్త్రార్జున్ యువక్ మండల్ అనే సంస్థ ఒక యూనిట్ రక్తం దానం చేసే దాతలక కిలో ఉల్లిని ప్రకటించింది. దీంతో ప్రజలు రక్తదానం చేయడానికి బారులు కట్టారు. దీనిలో మొత్తం 100 కిలోల ఉల్లిని దానం చేసి 126 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఇదిలా ఉంటే తమిళనాడులో ఓ మొబైల్ వ్యాపారి.. స్మార్ట్ ఫోన్ కొంటే కిలో ఉల్లి ఉచితం అని కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. ఇలా రకరకాల జోకులతో ఉల్లి మీద వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండిగ్ అవుతున్నాయి. మరింకేందుకు ఆలస్యం మీరు వాటిని చూసి నవ్వేసేయండి..