Deepavali: దీపావళి ఇలా జరుపుకుంటే లక్ష్మి దేవి మీ ఇంటిలోనే ఉంటుంది!!

Share

Deepavali:  దీపావళి  పండుగ నాడు బాగా  తెల్లవారుఝామున మేల్కొని    కాస్త వెచ్చటి నువ్వులనూనెను తలకు, శరీరానికి  పట్టించి   నలుగు తో బాగా రుద్దుకుని   గోరు వెచ్చటి నీటితో తలారా స్నానం చేయాలి. నువ్వుల నూనె లక్ష్మీదేవికి (Lakshmi devi)  ప్రతీక.  అందుకని  లక్ష్మి దేవిని పూజించే దీపావళి రోజు  నువ్వుల నూనెను ఒంటికి, తలకి పట్టించి  స్నానం చేయాలి.  దింతో పాటు   ఉత్తరేణి చెట్టు తెచ్చుకుని తల చుట్టూ త్రిప్పుకుని స్నానం చెయ్యడం. ఆ చెట్టుని ఏదో  అలా వేళ్ళతో ఉన్నదానిని తీసుకొచ్చిశుభ్రం చేసేసి ఓ కొమ్మ తెచ్చుకుని స్నానం చేసేయడం లాంటివి చేయకూడదు.ఉత్తరేణి చెట్టుని పైకి లాగినప్పుడు  మట్టి పెళ్ళలతో  పాటు  ఆ చెట్టు పైకి లాగాలి. అలా రావాలి అంటే ముందుగా నే   బాగా నీళ్ళు పోసి ఉంచి అప్పుడు పైకి తీస్తే అది మట్టితోటి పైకి వస్తుంది. అలా   మట్టితో  తెచ్చుకుని, స్నానం చేసేటప్పుడు ఆ ఉత్తరేణి చెట్టుని  దృష్టి దోషం పోవడానికి  తనకి తానే తల చుట్టూ త్రిప్పుకోవాలి. ఆ త్రిప్పుకునేటప్పుడు  ఈ  శ్లోకం (SLokam) చెప్పాలి.

Deepavali: శీతలోష్ఠ  సమాయుక్తా సకంటక దళాన్వితా

హరపాపం అపామార్గ భ్రామ్యమానః పునః పునః
అని చెప్పి  కనీసములో కనీసం మూడు మార్లు త్రిప్పాలి.    ఉత్తరేణి చెట్టు నాలుగైదు మార్లు తల చుట్టూ త్రిప్పుకుని ప్రక్కకి పారేసి ఆరోజు నిస్సంకోచం గా  దక్షిణ   దిక్కుకి తిరిగి యగ్నోపవీతం ఉన్నవాళ్లయితే యమధర్మరాజు గారికి తర్పణ ఇస్తారు.  ఆరోజున -యమాం తర్పయామి అంటూ 3 సార్లు తర్పణ ఇవ్వాలి.  ఒకవేళ యముడికి తర్పణ ఇవ్వకపోతే..  యమధర్మరాజు గారి  స్తోత్రం ఉన్నది అది ఒక్క దీపావళి  అమావాస్య రోజుమాత్రమే చదవాలి. ఒకవేళ ఆ నామాలు  రాసుకోవడం,  చదవడం భయం అనిపిస్తే..    ఈ ఉత్తరేణి చెట్టు తిప్పేసి స్నానం చేసేటప్పుడు దక్షిణ దిక్కుకి తిరిగి “ఓ యమ ధర్మరాజా! నీకు నమస్కరిస్తున్న” అని  అన్న తర్వాత మళ్ళీ ఉత్తర దిశగా  తిరిగి స్నానంముగించాలి.

లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరనివాసం

స్నానం చేసేటప్పుడు ఒంటి మీద స్నాన శాటీ  చెయ్యాలి. ఒంటి మీద ఏమి లేకుండా  చేస్తే ఇవన్నీ వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. అందుకని దిగంబరముగా చెయ్యకూడదు. చిన్న తువ్వాలో ఏదో కట్టుకుని అయినా చెయ్యాలి.
ఇలా దీపావళి అమావాస్యని ఎవరు చేస్తారో వాళ్ళకి జీవితం లో ఉన్నతి , లక్ష్మీ కటాక్షము కలగడం తో పాటు మృత్యు సమయం లో   ఈశ్వర భటులు  వచ్చేలాగా , మరణం పొందినతర్వాత  నరకద్వార దర్శనము కలుగ కుండా   భగవంతుడుఅనుగ్రహం చూపిస్తాయి అని మన శాస్త్రాలు తెలియ చేస్తున్నాయి అని మన ఆధ్యాత్మిక గురువు లు తెలియచేస్తున్నారు.
ఆ విధానం లో   తలంటు స్నానంముగించుకుని  కొత్త బట్టలు కట్టుకుని , పూజ చేసి తియ్యని పదార్ధాలు  తిని నోరు తీపి చేసుకోవడం అనేది ఎప్పటినుండో ఉన్న  సాంప్రదాయంతర్వాత సాయంత్రం ప్రదోష కాలంలో  లక్ష్మి పూజ భక్తి శ్రద్దలతో చేయాలి.

అమ్మవారి అలంకరణ

మారేడు, తామర, మల్లే, గులాబి వంటి పూలతో అమ్మవారిని  అర్చిస్తే మరి మంచిది. దక్షిణావృత శంఖం ఉంటే పూజలో పెట్టుకోండి. బంగారం, వెండి వంటి లక్ష్మీరూపాలను అమ్మవారి అలంకరణలోఉపయోగించండి. సుగంధ ద్రవ్యాలు, ధూపంతో పూజగది అంతా  చక్కటి వాసనలు వెదజల్లే విధంగా ఉంచుకోవాలి. బజారులో కొన్న స్వీట్లు వాడకుండా  మీ ఇంట్లో శుచిగా, శుభ్రంగా భక్తితో  తయారుచేసిన ఏదైనా మధుర పదార్థం అమ్మవారికి నివేదన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. బంధు, మిత్రులను పూజకు పిలుచుకుని  అందరిని ప్రేమతో ఆదరించి,   శక్తానుసారం బహుమానాలు, ప్రసాదాలు పంచాలి. పూజ  పూర్తి అయిన తర్వాత  పేదలకు ప్రసాదాన్ని ఇవ్వడం అనేది  చక్కని  ఫలితం ఇస్తుంది.  ఈ విధంగా పూజచేసుకుంటే ఏడాదంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరనివాసం చేసుకుంటుంది.ఇక సరిసంఖ్య లో  ఉండేలా  దీపాలు  వెలిగించాలి. రెండు నాలుగు ఆరు ఎనిమిది పది ఇలా పెట్టాలి.పిల్లలు గోగునారతో చేసిన  దివిటీలు దక్షిణం వైపు తిరిగి  కొట్టే ఆచారం ఉంది.

దివి దివి దీపావళి

ఈ ఆచారం పితృదేవతలకు వెలుగుచూపించే నిమిత్తం  చేసే చర్య.కొంత మంది ఆనవాయితీ ఉంటేనే కొట్టించాలి అంటారు.. దీనికి ఆనవాయితీ  ఉండవలిసిన అవసరం ఏమి లేదు.  ఎవరు అయినా పిల్లల చేత చేయించవచ్చు.  ఈ దివిటీలు కొట్టే సమయంలో పిల్లలు చాలా ఆనందంలో ఉంటారు.. ఎండిన గోంగూర పుల్లలకు వొత్తులు చుట్టి వెలిగించి దక్షిణం వైపు చూపించి పితృదేవతలను ప్రార్థ్ధిస్తారు.నూనెలో వత్తు వత్తి దానిని కర్రపై పెట్టి వెలిగించి ఈ దివిటీలు కొడతారు, పెళ్లికాని ఆడపిల్లలు, వడుగు కాని మగపిల్లలు చిన్నవాళ్లు మాత్రమే ఈ ప్రక్రియను  జరుపుతారు. ఆ దివిటీలు కొట్టేటప్పడు చా పిల్లలపై నూనె పడకుండా జాగ్రత్త తీసుకోండి..కాటన్ వస్త్రాలు వేసుకోవాలి.   ఆ దివిటీలు కొట్టేటప్పడు
దివి దివి దీపావళి మళ్లీ వచ్చే నాగులచవతి

ఫుట్టవిూద పాట్ట కర్ర

పట్టకురా బావమరిది
అనే పాట పాడుతారు.  దివిటీలు  కొట్టించడం అనేది ఏనాటి నుంచో పిల్లల చేత చేయిస్తున్నారు.
ఇలా దివిటి కొట్టిన తర్వాత కాళ్లు చేతులు శుభ్రం చేసుకుని  ఏదైనా  తీపి పదార్ధం తినాలి.  బ్రాహ్మణులకు మరియు ఆకలితో వున్నవారికి అన్నదానం చేస్తారు.తీపి తిన్న తర్వాత బాణ సంచా కాల్చినతర్వాత  భోజనాలు అన్ని ముగించి మళ్ళి… ఈ రోజు రాత్రికి  నిద్రపోకుండా జాగరణ చేస్తారు. ఎందుకంటే ఆశ్వయ్యుజ అమావాస్య రోజు రాత్రిపూట లక్ష్మీదేవి  ఎవరి ఇంటిలో దీపాలు వెలుగుతాయా అని  వెదుకుతూ తిరుగుతు వుంటుంది. ఎక్కడైతే ఆ సమయం లో దీపాలు పెడతారో చారిత్రవంతులు, కర్తవ్యదక్షులు, ఓపిక గలవారు, ధర్మనిష్ఠ గలవారు, భగవత్భక్తి మరియు క్షమాశీలులైన పురుషులు మరియు గుణవంతులైన, పతివ్రతా స్త్రీలు నివసించే గృహంలో మాత్రమే లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది.


Share

Related posts

Love story : లవ్ స్టోరి పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అంటే మామూలు విషయం కాదు..!

GRK

బుక్క‌యిపోయిన కేసీఆర్ … ఒకే ఒక్క నిర్ణ‌యం ఎంత ప‌ని చేసింది?

sridhar

Weight Loss: ఈ ఫ్రూట్స్ తింటే సూపర్ ఫాస్ట్ గా బరువు తగ్గుతారు..!!

bharani jella