అందరూ ఎదురు చూస్తుంటే ఇక సినిమాలు మానేశానన్న స్టార్ హీరోయిన్ ..?

సినిమా ఇండస్ట్రీలో చాలా మనది హీరోయిన్స్ ఒక వెలుగు వెలిగాక పెళ్ళి చేసుకొని సెటిలైపోతారు. కాని ప్రియమణి లాంటి బ్యూటి ఫుల్ హీరోయిన్స్ మాత్రం మళ్ళీ అవకాశాలు వస్తే హీరోయిన్ గా చేయడానికి రెడీ అవుతారు. అదృష్ఠం కలిసి వచ్చి స్టార్ హీరో లకి జంటగా నటించే అవకాశాలు వస్తుంటాయి. అలా ఇప్పుడు ప్రియమణి రెండు సినిమాలు చేస్తోంది.

Ko Kodi Bhagundi Full Video Song || Jia Chiranjeeva Movie || Chiranjeevi,  Sameera Reddy - YouTube

కాగా మరో హీరోయిన్ గురించి కూడా ఫ్యాన్స్ గత కొన్నాళ్ళుగా రీ ఎంట్రీ ఇస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు. సీనియర్ హీరోలకి హీరోయిన్స్ సమస్య ఉంది కాబట్టి ఆ హీరోయిన్ ఒకే అంటే అవకాశాలు ఇచ్చే మేకర్స్ కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అవకాశం కూడా వచ్చింది. కాని తను మాత్రం ఇక సినిమాలు చేసే ఆలోచన లేదని తేల్చి చెప్పేసిందట.

Still watch all NTR movies-Sameera Reddy

ఆ హీరోయిన్ ఎవరో కాదు..సూపర్ హిట్ సినిమాలు చేసి క్రేజ్ సంపాదిచుకున్న సమీరా రెడ్డి. గతంలో మెగాస్టార్ చిరంజీవి తో జై చిరంజీవ, ఎన్ఠీఆర్ తో అశోక్, నరసింహుడు, కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. కాగా పెళ్ళి తర్వాత సమీరా రెడ్డి పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటోంది.

చాలా మంది మేకర్స్ ఇలా సీనియర్ హీరోయిన్స్ కి తమ సినిమాలలో అవకాశాలివ్వడానికి ఆసక్తి చూపిస్తున్న తరుణంలో తాజాగా తమిళంలో ఆర్య, విశాల్ నటించబోతున్న లేటెస్ట్ సినిమాలో కీలక పాత్ర కోసం సమీరా రెడ్డిని సంప్రదించగా ..ఇకపై సినిమాల్లో నటించే ఆసక్తి లేదని చెప్పినట్టు సమాచారం. ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి కొంత డిసప్పాయిన్‌మెంటే అని చెప్పాలి.