NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ ఆదేశిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి ఏపీ రాజకీయాల్లో రాణిస్తా అంటున్న పక్క రాష్ట్ర మంత్రి..!!

వైసిపి ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన బీసీ సంక్రాంతి సభ అంగరంగ వైభవంగా జరిగింది. బీసీ సామాజిక వర్గాలకు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సరైన న్యాయం జరిగిందని చాలామంది బీసీ వర్గాలకు చెందిన కీలక నాయకులు పేర్కొన్నారు. అంతకుముందు ప్రభుత్వాలు బీసీ వర్గానికి చెందిన వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూడటం జరిగిందని, కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

Puducherry Health Minister calls on Andhra CM on resolving interstate issues- The New Indian Expressఇలా ఉండగా ఈ కార్యక్రమానికి పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల ప్రజలు నాయకులు జగన్ లాంటి ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో వుండాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్ ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్ర ప్రజలను నాయకులను ప్రభావితం చేసే రీతిలో ఉన్నట్లు స్పష్టం చేశారు.

 

కరోనా లాంటి కష్ట సమయంలో దేశంలో చాలా రాష్ట్రా ప్రభుత్వాలు తమ ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో జగన్ ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆగిపోకుండా పరిపాలించడం చాలా గ్రేట్ అని తెలిపారు. ఏపీ లో జగన్ పరిపాలన అమలవుతున్న సంక్షేమ పథకాల విధానం చూసి ఇతర రాష్ట్ర నాయకులకు మతిపోతుంది అని మల్లాది కృష్ణా రావు స్పష్టం చేశారు. రాజకీయాల్లో వైయస్ దయవల్ల వచ్చానని చెప్పుకొచ్చిన ఆయన పాండిచ్చేరిలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు చైర్మన్ గా గెలిచినట్లు ప్రస్తుతం మంత్రిగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జనవరి 6వ తారీఖున పాండిచ్చేరి రాజకీయానికి స్వస్తి చెపుతూన్నట్లు స్పష్టం చేశారు. దీంతో జగన్ గారు అవకాశం ఇస్తే మొత్తానికి పాండిచ్చేరి నుండి దుకాణం సర్దుకుని ఏపీలో పార్టీకి సేవ చేసుకుంటానని, అవసరమైతే ఇప్పటికిప్పుడు మంత్రి పదవికి కూడా రాజీనామా చేస్తానంటూ మల్లాది కృష్ణారావు బీసీ సంక్రాంతి సభలో స్పష్టం చేశారు.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju