నయనతార పెళ్ళి జరగాలంటే ముందు ఇది జరగాలి ..?

Share

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార సినిమాలలో ఎంతటి గొప్ప పేరు ని సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. కోలీవుడ్, టాలీవుడ్ లో నయన్ దాదాపు అందరు స్టార్ హీరోలతో ను నటించింది. లక్కీ హీరోయిన్ అన్న పేరుంది. టాలెంటెడ్ హీరోయిన్ అన్న ప్రశంసలు దక్కాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తననే వెతుక్కుంటూ వచ్చాయి. ఇంత పాపులారిటిని సాధించిన నయన్ ప్రేమ, పెళ్ళి విషయం లో మాత్రం కొన్ని తప్పటడుగులు వేసింది.

नयनतारा: प्रभुदेवा के लिए धर्म बदला, पर नहीं मिला मोहब्बत को अंजाम - Entertainment AajTak

నయన్ ఇప్పటికే శింబును ప్రేమించింది. ఆ ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవాతో నయనతార పెళ్లి వరకు వెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉంది. కాని జనాలు మాత్రం ఈ బంధం అన్న నిలబడుతుందా లేదా ..అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పెళ్లి విషయంలో ఇద్దరు చాలా క్లారిటీగా ఉన్నట్లుగా తాజాగా విఘ్నేష్ శివన్ వెల్లడించాడు.

ఈ ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం గత రెండు మూడేళ్ళు గా సాగుతుంది. మొదట్లో తమ ప్రేమ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు నయన్, విఘ్నేష్ శివన్. కాని ఈమద్య కాలంలో వారు రెగ్యగులర్ గా సోషల్ మీడియాలోనో, బహిరంగ ప్రాంతాల్లో కనిపిస్తూ మేము ప్రేమికులం అని చెప్పకనే చెప్పారు. అయితే పెళ్లి విషయంలో మాత్రం వారు క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదుగో అదుగో అంటూ వార్తలు వస్తున్నాయి గాని ఇప్పట్లో ఈ జంట పెళ్ళి చేసుకునేలా కనిపించడం లేదు.

చాలా మంది పెళ్లి గురించి ప్రశ్నిస్తున్నారు. త్వరలో పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ఇద్దరం కూడా కెరీర్ పై దృష్టి పెట్టి ఉన్నాం. తనకు కెరీర్ లో చాలా గోల్స్ ఉన్నాయి. వాటి కోసం పెళ్లి తర్వాత ప్రయత్నించడం కంటే పెళ్లికి ముందే అనుకున్నవి అన్ని కూడా పూర్తి చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో మేమిద్దరం పెళ్లి పై ప్రస్తుతం ఆలోచించడం లేదని విఘ్నేష్ శివన్ క్లారిటీ ఇచ్చాడు. అంటే ముందు కెరీర్ లో అనుకున్న గోల్స్ రీచ్ అయితే గాని నయన్ – విఘ్నేష్ శివన్ ల పెళ్ళి జరుగుతుంది. అది ఎన్నేళ్ళకో మరి.


Share

Related posts

విశాఖలో మెట్రోరైల్… వ‌చ్చే నెలలోనే గుడ్ న్యూస్‌

sridhar

ఆసక్తికరమైన టైటిల్‌తో…

Siva Prasad

మోదీ సర్కారు పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తోంది.. ఫైర్ అయిన తెలంగాణ మంత్రి తలసాని

Varun G