Pimples: మొటిమలు ఎక్కువగా ఉంటే..  ఆ కోరికలు ఎక్కువగా కలగడం నిజమేనా??

Share

Pimples:  ముఖంపై మొటిమలు
టీనేజ్  వచ్చినప్పటి నుంచి శరీరం లో  ఎన్నో మార్పులు వస్తుంటాయి. వాటితో పాటు   శృంగార  పరమైన కోరికలు కలగడం అనేది కూడా సహజం గా జరుగుతుంది. ఆ వయసులోనే ముఖంపై మొటిమలు ( Pimples ) కూడా ఎక్కువగా వస్తుంటాయి.  అయితే  మొటిమలు శృంగార వాంఛలకు సంకేతాలుగా భావించాలా? మొటిమలు ఎక్కువగా ఉన్నవారిలోశృంగార కోరికలు ఎక్కువగా  ఉంటాయి అనడం వెనుక ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం.

Pimples: శరీరంలో సెక్స్ హార్మోన్లు

టీనేజ్ లో కి అడుగు పెట్టగానే  శరీరంలో రకరకాల మార్పులు  చోటుచేసుకుంటాయి.  అమ్మాయి లు అయితే స్తనాలు పెరగడం, రజస్వల కావడం తో పాటు శరీరం లో వచ్చే ఇతర మార్పులతో అందం గా మారతారు.  అలాగే  అబ్బాయిల శరీరం లో కూడా అనేక మార్పులతో దేహదారుఢ్యం పెరగడం ,గొంతు మారడం ,నూనూగు మీసాలు లతో  గెడ్డలతో ఆకర్షణీయం గా ఉంటారు. ఈ మార్పులతో పాటు ఆ వయసులోనే ముఖంపై మొటిమలు కూడా  పుట్టుకొస్తుంటాయి.  అయితే ఎంత ఎక్కువ  మొటిమలు ఉంటే అంత ఎక్కువగా కామవాంఛ ఉంటుంది అనే అపోహకూడా ఉండడం తో మొటిమలు ఎక్కువ ఉన్నవారు నలుగురిలోకి రావాలంటే సిగ్గు పడిపోతూ ఉంటారు.అయితే మొటిమలకు ఆ  కోరికలకు మధ్య ఎలాంటి సంబంధం ఉండదని నిపుణులు తెలియచేస్తున్నారు. శరీరంలో సెక్స్ హార్మోన్లు ఉత్పత్తి   వల్ల కొన్ని గ్రంథులు ప్రతి  స్పందించడం వలన అవి మొటిమల రూపంలో  కనిపిస్తాయి. అయితే చాలా మందిలో కొద్దిపాటి సెక్స్ హార్మోన్ల ఉత్పత్తి కారణం గా కూడా ముఖంపై ఉన్న గ్లాండ్స్  ప్రతిస్పందించి ఉబ్బుతుంటాయి.  అవే మొటిమలుగా కనిపిస్తాయి. కాబట్టి  ముఖంపై వచ్చే మొటిమలకు శృంగార కోరికలకు ఎటువంటి  సంబంధం ఉండదని నిపుణులు వివరిస్తున్నారు .

అతిగా మొటిమలు ఉంటే

ఒంట్లో కొవ్వు నిల్వలు ఎక్కువగా ఉన్నా..  మీరు శుభ్రంగా లేకపోయినా, శుభ్రమైన ఆహారాన్ని తీసుకోకపోయినా , మలబద్ధక సమస్య  ఉన్నా, హార్మోనల్ సమస్యలు ఉన్నా, నెలసరి కి  ముందు, లేదా సరిగ్గా నిద్ర లేకపోయినా మొటిమల ఎక్కువగా వస్తాయి. వీటికి విరుగుడు ఏమిటంటే ఇప్పుడు చెప్పిన  కారణాలలో ఏ ఒక్కటి మీకు ఉన్న వాటి పై దృష్టి పెట్టాలి.  మరీ అతిగా మొటిమలు ఉంటే  డెర్మటాలజిస్టు దగ్గర చికిత్స తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగడం తో పాటు,పీచు  అధికంగా ఉన్న ఆహారాన్నితీసుకునేలా చూసుకోవాలి. నూనె పదార్ధాలు , బేకరీ ఐటమ్స్ , స్వీట్లు వంటి పదార్థాలను చాలా తక్కువగా తీసుకోవడం మంచిది.రక్తంలో టాక్సిన్లు ఎక్కువగా ఉన్నా కూడా  మొటిమలు వస్తాయి.

 మొటిమలు  తగ్గించుకోవడానికి

మొటిమలు సహజం గా   నివారించుకోవడం  కోసం బాగా పండిన   బొప్పాయి ముక్కలను పేస్ట్ గా  చేసి ముఖానికి  రాసుకుని    15- 20 నిముషాలు పాటు  ఆరిన తర్వాత గోరువెచ్చని  నీరు తీసుకుని ముఖం శుభ్రంగా కడిగేసుకోవాలి. మొటిమలు  తగ్గించుకోవడానికి  ఇది  బెస్ట్ టిప్ అనే చెప్పాలి.
లేదంటే ఇలా కూడా చేయవచ్చు..    ముఖంను శుభ్రం చేసుకొని , తడి మొత్తం  ఆరిన తర్వాత, కొన్ని పుదీనా ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి  ముఖానికి  రాసుకుని 15నిముషాలు పాటు  అలాగే  ఆరనిచ్చి.. చల్లటి నీటితో శుభ్రం గా కడిగేసుకుంటే సమస్య నివారణ అవుతుంది. సహజమైన పద్ధతులు పాటిస్తే అన్ని విధాలా మంచిది.


Share

Related posts

PUSHPA : PAN ఇండియా స్టార్ గా ప్రభాస్ ని దాటేసిన అల్లు అర్జున్ ? అతిపెద్ద రికార్డ్ ? 

siddhu

Ather 450 X : ఏథర్ 450 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఢిల్లీ లో లాంచ్.. ఫీచర్స్ చూసేయండి..

bharani jella

Manchu Mohanbabu Vishnu: తండ్రీ తనయుల షాకింగ్ కామెంట్స్..!!

somaraju sharma