Rajamouli : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా లాక్ డౌన్ ఫస్ట్ వేవ్ తర్వాత మొదలైన ఈ సినిమాను రాజమౌళి బృందం రాత్రింబవళ్ళు పనిచేసి చిత్రీకరణను చివరి దశకు తీసుకువచ్చారు. కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ మధ్య ఈ ప్రమోషన్ సాంగ్ గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి.
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ప్రమోషనల్ సాంగ్ ను ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో లేని, రాని విధంగా రాజమౌళి ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ ఒక్క సాంగ్ కే దాదాపు 3కోట్ల భారీ ఖర్చుతో సెట్స్ వేసి ఖరీదైన సెట్టింగ్ లో తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో ఉన్న ప్రధాన తారాగణం అంతా ఈ ప్రమోషనల్ సాంగ్లో పాల్గొంటున్నారట. అంతేకాదు ఈ సాంగ్లో టాలీవుడ్ స్టార్స్ కొందరు రాజమౌళి ప్లాన్ చేసిన ఈ ప్రమోషనల్ సాంగ్ లో సందడి చేయబోతున్నట్టు చెప్పుకుంటున్నారు.
Rajamouli : రానా, తమన్నా కూడా కొన్ని క్షణాలు సర్ప్రైజ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది.
అయితే ఆయన దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియన్ సినిమా బాహుబలిలో నటించిన ప్రభాస్ – అనుష్క తప్పకుండా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పుడు నాలుగు పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు. చాలా బిజీ. అయినా రాజమౌళి అడిగితే ఇటు ప్రభాస్ గానీ, అటు అనుష్క గానీ కాదనరనేది అందరికీ తెలిసిందే. ఇక రానా, తమన్నా కూడా కొన్ని క్షణాలు కనిపించి సర్ప్రైజ్ చేయనున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ ఈ సాంగ్ మాత్రం కలకాలం నిలిచిపోయేలా ఉంటుందని అంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!