Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్‌కి ఆ ఒక్క హిట్టు పడకపోతే ఇక టాలీవుడ్‌లో అడుగుపెట్టదేమో పాపం..

Share

Rakul Preet Singh: ఒకప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. మెగా హీరోలతో పాటు టాలీవుడ్ స్టార్స్ కొత్త సినిమా ఏది అనౌన్స్ చేస్తున్న ముందుగా రకుల్ పేరునే పరిశీలించారు. అంతగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీని సాధించింది. రకుల్ ప్రీత్ ‘కెరటం’ సినిమాతో పరిచయమైంది. అయితే ఈ సినిమా ఆమెకి అంతగా గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత వచ్చిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ఆమె ప్రార్థన అనే పాత్రలో నటించి ఆకట్టుకుంది.

if-rakul-preet-singh-did-not-get-that-one-hit-she-would-have-entered-tollywood
if-rakul-preet-singh-did-not-get-that-one-hit-she-would-have-entered-tollywood

ప్రార్థన.. ప్రతీ రూపాయికి ఓ లెక్కుంటుంది అని చెప్పే డైలాగ్‌తో అటు ప్రేక్షకులను ఇటు మేకర్స్‌ను బాగా అట్రాక్ట్ చేసింది. దాంతో ఈమెకి తెలుగులో వరుసగా అవకాశాలు దక్కాయి. స్టార్ హీరోల సరసన నటిస్తూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకుంది. మాచో హీరో గోపీచంద్‌తో ‘లౌక్యం’, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్‌తో ‘నాన్నకు ప్రేమతో’, మెగా పవర్ స్టార్ రాం చరణ్‌తో ‘ధృవ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ రకుల్ ఖాతాలో చేరాయి. ఒకదశలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాకి కూడా డేట్స్ ఇవ్వలేనంత బిజీగా గడిపింది.

Rakul Preet Singh: ఉన్నపలంగా రకుల్ కెరీర్ గ్రాఫ్ అమంతం పడిపోయింది.

అయితే ఉన్నపలంగా రకుల్ కెరీర్ గ్రాఫ్ అమంతం పడిపోయింది. ఎంత చూసిన అవకాశాలు దక్కలేదు. అటు తమిళం నుంచి కూడా రకుల్ ప్రీత్ కి సినిమాలలో నటించే అవకాశాలు దక్కలేదు. దాంతో తప్పని పరిస్థితుల్లో కింగ్ నాగార్జున సరసన అవకాశం వస్తే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే రకుల్ కెరీర్ గ్రాఫ్ వేరేలా ఉండేదేమో. కానీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. ఆ సినిమానే మన్మధుడు 2. గతంలో త్రివిక్రం శ్రీనివాస్ కథ, మాటలతో విజయ్ భాస్కర్ రూపొందించిన మన్మధుడు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా సూపర్ హిట్.

కానీ నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన మన్మధుడు 2 మాత్రం అంచనాలను తారుమారు చేసి బాక్సాఫీస్ వద్ద చతికిల పడిదింది. దాంతో రకుల్ ప్రీత్ ఈ సినిమా మీద పెట్టుకున్న ఆశలన్ని తారుమారయ్యాయి. ఇక టాలీవుడ్‌లో అమ్మడి కెరీర్ క్లోజ్ అనుకుంటున్న సమయంలో లక్కీగా నితిన్ చంద్ర – శేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో వచ్చిన చెక్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇదే సమయంలో క్రిష్ – మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన కొండపొలం సినిమాలో కూడా అవకాశం అందుకుంది.

Rakul Preet Singh: అమ్మడి ఆశలన్ని కొండపొలం సినిమా మీదే పెట్టుకుంది.

దాంతో రకుల్ కెరీర్ టాలీవుడ్‌లో మళ్ళీ ఊపందుకుంది అని చెప్పుకున్నారు. కట్ చేస్తే పాపం నితిన్ తో నటించిన చెక్ సినిమా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. దాంతో ఇప్పుడు అమ్మడి ఆశలన్ని కొండపొలం సినిమా మీదే పెట్టుకుంది. ఇందులో ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్రలో రకుల్ నటించింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కూడా రిజల్ట్ తేడా కొడితే ఇక మళ్ళీ టాలీవుడ్‌లో కనిపించడం కష్టమే. ఎందుకంటే అమ్మడికి బాలీవుడ్‌లో బాగా క్రేజ్ ఉంది. అక్కడ వరుసగా అజయ్ దేవగణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది.


Share

Related posts

RRR : మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ ఎంపి రఘురామ కృష్ణం రాజు… రాజీనామాకు సిద్ధమే కానీ..

Srinivas Manem

బిగ్ బాస్ 4 : “నువ్వెవ్వడు నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి?” అభిజిత్ కి కోపం వస్తే మామూలుగా లేదు

arun kanna

‘కేంద్రానికి మన అవసరం ఉంటుంది:భవిష్యత్ లో ప్రత్యేక హోదా ఖాయం’

somaraju sharma