సాయి పల్లవి .. ప్రస్తుతం తెలుగులో ఈ మధ్య కాలంలో ఏ సినిమా మొదలైనా ముందు వినిపిస్తున్న పేరు. ఇప్పటికే వరసగా సినిమాలు చేస్తున్న sai pallavi కోసం మరో స్టార్ హీరో ట్రై చేస్తున్నాడా .. అవుననే మాట వినిపిస్తోంది. sai pallavi ఇప్పటికే నాగ చైతన్య సినిమా కంప్లీట్ చేసింది. రానా తో విరాట పర్వం కూడా దాదాపు కంప్లీట్ అయింది. ఇప్పుడు నాని నటిస్తున్న శ్యాం సింగ్ రాయ్ సినిమాలో నటిస్తున్న sai pallavi కి ఈ మధ్య మేకర్స్ వరసగా అవకాశాలివ్వడానికి క్యూ కడుతున్నారట.
ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ సీటిమార్ అన్న సినిమా చేస్తున్నాడు. తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. కబడ్డీ ఆట నేపథ్యంలో సీటీమార్ తెరకెక్కుతుండగా గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్ లు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సస్ మీద gopichand చాలా నమ్మకంగా ఉన్నాడు. అంతేకాదు సీటీమార్ సినిమాతో భారీ హిట్ సాధించాలన్న కసితో దర్శకుడు సంపత్ నంది కూడా ఉన్నాడు. కాగా రీసెంట్ గా gopichand – మారుతీ కాంబినేషన్ లో కొత్త సినిమాని ప్రకటించారు. యూవి క్రియేషన్స్ – గీతా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
దర్శకుడు మారుతి గత చిత్రం ప్రతీ రోజూ పండుగే మంచి కమర్షియల్ హిట్ ని సాధించింది. దాంతో ఇప్పుడు మారుతి – gopichand కాంబినేషన్ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. కాగా ప్రస్తుతం హీరోయిన్ ని సెలెక్ట్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో మన టాల్ హీరో గోపీచంద్ కి జంటగా హీరోయిన్ గా పలువురు హీరోయిన్స్ ని పరిశీలిస్తున్నారట. రాశీఖన్నా, sai pallavi ల తో పాటు మోడల్స్ ని చిత్ర బృందం పరిశీలిస్తున్నారట. అయితే ఎక్కువగా సాయి పల్లవి ని తీసుకోవాలన్న ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. నిజంగా sai pallavi గనక ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తే gopichand కి పక్కా హిట్ పడ్డట్టే అంటున్నారు. అందుకు కారణం కథ అధ్బుతంగా ఉంటే గాని సాయి పల్లవి సినిమాకి సైన్ చేయదు కాబట్టి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!