shiva Abhishekam : శివాభిషేకం ఏ పధార్ధాలతో చేస్తే.. ఎలాంటి అనుగ్రహం కలుగుతుందో తెలుకుందాం.
ఆవు పాల తో అభిషేకం సర్వ సౌఖ్యములను ఇస్తుంది.
ఆవు నేయితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును
3. గరిక నీటితో శివాభిషేకము చేసుకుంటే నష్టమైన ద్రవ్యము తిరిగి పొందుతారు.
4 పెరుగుతో అభిషేకం చేస్తే బలము, ఆరోగ్యము, యశస్సు పొందుతారు.
5. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు బాధ ఉండదు.
6 చెరకు రసముతోఅభిషేకం చేస్తే ధన వృద్ధి కలుగుతుంది.
7 మెత్తని చేక్కరతోపంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నాశనము అవుతుంది.
8 బిల్వదళ జలము చేత అభిషేకము చేస్తే భోగభాగ్యములు కలుగుతాయి.
9 తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ది కలుగును.
10 పువ్వులు వేసిన నీటి తో అభిషేకం చేస్తే భూలాభము కలుగుతుంది.
11 కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సకల సంపదలు చేకూరతాయి.
12 రుద్రాక్ష లు వేసిననీటితో అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యములు ప్రాప్తిస్తాయి.
13 భస్మాభిషేకంచే చేయడం తో మహా పాపాలు నశించి పోతాయి.
14 గంధపు నీటితో అభిషేకం చేస్తే సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది.
15 బంగారపు నీటితో అభిషేకము చేయడం వలన ఘోర దారిద్రము కూడా నశించి పోతుంది.
16 నీటితో అభిషేకం చేస్తే నష్టపోయినవి తిరిగి పొందుతారు.
17 అన్నముతోఅభిషేకం చేస్తే , అధికార ప్రాప్తి, మోక్షము దీర్ఘాయువు ను పొందుతారు. శివపూజలో అన్నం తో లింగార్చన చేయడానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పెరుగు కలిపిన అన్నముతో శివ లింగం మొత్తం అద్ది పూజ చేస్తారు. ఆ అద్దిన అన్నాన్ని అర్చన తర్వాత ప్రసాదముగా పంచుతారు. చూడటానికి ఎంతో బాగుంటుంది అన్న లింగార్చన .
18 ద్రాక్షా రసముచే అభిషేక చేస్తే ప్రతి దానిలో విజయము పొందుతారు.
19 ఖర్జూర రసము తో అభిషేకము చేస్తే శత్రుహాని కలుగకుండా చేస్తుంది .
20 నేరేడు పండ్ల రసము తో అభిషేకం చేస్తే వైరాగ్య సిద్ది కలుగుతుంది.
21 కస్తూరి కలిపిన నీటి తో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది.
22 నవరత్నోదకము తో అభిషేకము చేస్తే ధాన్యము, గృహ, గోవృద్ది కలుగుతుంది.
23 మామిడి పండ్ల రసము తో అభిషేకము చేస్తే దీర్ఘ వ్యాధులు కూడా తగ్గిపోతాయి.
24 పసుపు నీటితో అభిషేకం చేస్తే,మంగళ ప్రదము అవడం తో పాటు శుభ కార్యాలు జరుగుతాయి.