NewsOrbit
న్యూస్ సినిమా

అదే జరిగితే ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..ఇప్పటికే చాలా ఓపిక పట్టారు..!

Share

డార్లింగ్ ప్రభాస్ బాహుబలి చేస్తున్న సమయంలో సాహో సినిమా అనౌన్స్ చేశాడు. అలాగే సాహో చేస్తున్న సమయంలో ‘రాధేశ్యామ్’ సినిమాను మొదలు పెట్టాడు. ఇప్పుడు కూడా ‘రాధేశ్యామ్’ చేస్తూనే మరో రెండు భారీ ప్రాజెక్ట్స్ ని మొదలు పెట్టబోతున్నారు. సాహో రిలీజ్ కాకముందే రాధేశ్యామ్ కొంత టాకీ పార్ట్ కూడా పూర్తి అయ్యింది. అందుకే సాహో కి రాధేశ్యామ్ రిలీజ్ విషయంలో పెద్ద గ్యాప్ రాదని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశపడ్డారు.

Radhe Shyam में Prabhas क्या दिखा पाएंगे बाहुबली जैसा जलवा? फिल्म का फर्स्ट  लुक तो दमदार है - Prabhas movie Radhe Shyam first look revealed, Prabhas  romantic movie with Pooja hegde Directed

కాని బాహుబలి, సాహోల మాదిరిగానే రాధేశ్యామ్ కూడా రిలిజ్ కి చాలా సమయం పడుతుంది. అదీ కాక రాధేశ్యామ్ సినిమా కు సంబంధించి చిత్ర యూనిట్ సరైన అప్ డేట్ ఏమీ ఇవ్వక పోవడంతో సోషల్ మీడియాలో యూవీ క్రియేషన్స్ కు వ్యతిరేక ప్రచారం మొదలైన విషయం తెల్సిందే. తమ అభిమాన హీరో సినిమా కి సంబంధించి అప్‌డేట్స్ ఇవ్వడం లేదని ఫ్యాన్స్ నెగిటివ్ గా కామెంట్స్ చేశారు.

ఫ్యాన్స్ ఒత్తిడి వల్ల రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. కాగా ప్రభాస్ బర్త్ డే వచ్చే నెల 23న ఉండటంతో… ఆ రోజు రాధేశ్యామ్ నుంచి భారీ గిఫ్ట్ ఉంటుందని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్న నేపథ్యంలో రాధేశ్యామ్ కు సంబంధించిన హ్యాష్ ట్యాగ్ ను కూడా ట్రెండ్ చేసి రికార్డు సృష్టించాలంటూ ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారట.

అయితే రాధేశ్యామ్ నుండి ప్రభాస్ బర్త్ డేకు టీజర్ ను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేశారట. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం టీజర్ కాకుండా మోషన్ పోస్టర్ వచ్చే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు. దాంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మోషన్ పోస్టర్ అయితే ఫ్యాన్స్ కి సరిపోదని.. కావల్సిన కిక్ ఉండదని ప్రచారం మొదలైంది. అంతేకాదు ఇదే జరిగితే ఫ్యాన్స్ ఊరుకుంటారా అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Share

Related posts

తగ్గిన బాబు మెజారిటీ!

Siva Prasad

జగన్ సర్కార్ ని ఇబ్బంది పెడుతున్న కేసీఆర్ నిర్ణయం..!!

sekhar

స్మార్ట్‌గా ప‌ని కానిచ్చారుగా!

Siva Prasad