Youth: ఉద్యోగాలు చేసే యువత
నేటి యువత ఆధునికత వైపు అత్యంత వేగంగా ఆకర్షించ బడుతుంది. ఈ కారణంగా వచ్చే ఆదాయం భద్ర పరుచుకోవడం అనేది చాలా ముఖ్యం. ప్రతి అడుగు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వేయాలి. ఈ కారణం గా ఉద్యోగాలు చేసే యువతకు నిపుణులు అనేక మార్గ దర్శకాలను సూచిస్తున్నారు. పెళ్లి అయింది అంటే ఆదా చేయడం అనేది చాలా కష్టమైన పనిగా చెప్పవచ్చు. అందుకే ఉద్యోగం లో చేరిన దగ్గరనుండే డబ్బు పొదుపు చేసుకోమని నిపుణులు తెలియచేస్తున్నారు.
Youth: దీర్ఘ కాలిక లక్ష్యాన్ని
ముందుగా మీకు వచ్చే ఆదాయానికి సరిపడా ఖర్చులు పెట్టేయకుండా ఉండేందుకు నియంత్రణ మీ అంతటా మీరే విధించుకోవాలి. తర్వాత పెట్టుబడుల రంగంలోకివెళ్తే మంచిది అంటున్నారు నిపుణులు. ప్రతీ నెలా మీరు కనీసం 5 వేలను ఆదా చేసుకునే విధం గా మీ ప్లాన్ ఉండాలి అని తెలియచేస్తున్నారు. ఒక దీర్ఘ కాలిక లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని అంటున్నారు. ఆ లక్ష్యం కోసం ఉన్న ఆదాయాన్ని కట్టుదిట్టంగా భద్రపరుచుకోవడం తో పాటు ఆదాయ మార్గాలను పెంచుకోవడం చాలా అవసరమని అంటున్నారు. ఉదాహరణకు మీరు 50 వేలు టార్గెట్ గా పెట్టుకుని వాటిని సరైన మార్గంలో పెట్టుబడి పెట్టెల ప్లాన్ చేసుకోవాలి. దాని కోసం సరైన పెట్టుబడి మార్గాలు వెదకాలి. ఆదాయం అనేది ఒక ఉద్యోగంలో సాధ్యం కావడం లేదు అనుకుంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆ డబ్బులు మీ పెట్టుబడులకు వాడడం అనేది మంచి పద్దతి.
గ్రౌండ్ వర్క్
ఇలా పెట్టుబడులు పెట్టడానికి మీరు చాలా గ్రౌండ్ వర్క్ చేసి మీకు తగినదాన్ని ఎంచుకోండి. రోజు వారి ఖర్చులు తగ్గించి , అప్పుల జోలికి వెళ్ళకుండా మిమ్మల్ని మీరు అదుపు చేసుకోవాలి.అన్నిటికన్నా ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ వాడకాలను బాగా అదుపు లో ఉంచుకోవాలి. మీ ఆదాయం మొదలవగానే ముందు పొదుపు కు డబ్బు పక్కన పెట్టి మిగిలిన దానిలో ఖర్చు పెట్టుకోండి. లేదంటే డబ్బు మిగలడం అనేది ఉండదు.