Architectural flaws: ఇంట్లో ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా వాస్తు దోషాలు  ఉన్నాయని తెలుసుకోండి !!

Share

Architectural flaws: ఇల్లు చూస్తే వాస్తు శాస్త్రం ప్రకారం  చాలా బాగుంటుంది.  కానీ ఆ ఇంట్లోకి వచ్చిన  దగ్గర నుండి అనారోగ్యాలు, అకారణ చికాకులు, గొడవలు, పోలీస్ స్టేషన్ వ్యవహారాలు, లేనిపోని టెన్షన్,పిల్లల ప్రవర్తనలో మార్పు, యాక్సిడెంట్ ఇలా ఏదో  ఒక మార్పు జరుగుతూ ఉంటుంది.   జాతకం ప్రకారం ఏ దోషం లేకపోయినా కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆ ఇంటి వాస్తు   లోపం లేదా శల్య దోషం, గోచార గ్రహ దోషాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అప్పులు ఎక్కువైపోవడం , చేసిన అప్పులు తీర్చలేక పోవడం, మానసిక క్షోభ, ప్రతి విషయంలో  బాగా కృంగిపోవడం,  హత్య, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం, పీడకలలు  వేధించడం, ఇంట్లో తెలియని   రకమైన  చెడు వాసనలు రావడం,  అవమానాలు, పిల్లలు లేకపోవడం , అనేకమైన వ్యాధుల బారిన పడడం, ఇతరత్రా స్త్రీలపై విపరీతమైన కామ ప్రకోపాలు  ఇలాంటివి  ఇంట్లో జరిగితే  వాస్తు దోషం ఉందని  తెలుసుకోవాలి.

వీటితో పాటు  పెంపుడు కుక్క అస్తమానం ఒకే  దిక్కుకి  తిరిగి  మొరగడం  కూడా ఒక సూచన అనే చెప్పాలి. ఇంట్లోకి పాములు, గబ్బిలాలు రావడం, కాకులు ఎక్కువగా వాలటం, ఆ ఇంటి చుట్టూ  పక్కల  మాత్రమే కాకులు ప్రదక్షిణ చేయడం కూడా కనబడని వాస్తు లోపాలు కి   గుర్తు అని చెబుతున్నారు వాస్తు నిపుణులు. దొంగతనాలు, అగ్నిప్రమాదాలు, అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు, చర్మ వ్యాధులు, ఉద్యోగం  దొరక పోవడం..   అదే విధంగా ఆడపిల్లలు భర్తతో గొడవలు జరిగి   పుట్టింటికి చేరుకోవడం, మెట్టినింటి కష్టాలు, భర్త చెడు వ్యసనాల తో పుట్టింటి వారిని పీడించడం  ఇవన్నీ వాస్తు దోషాల గా లెక్క వేయబడతాయి.

ఎంత చిన్న ఇల్లు నిర్మాణం కూడా కరెక్ట్ గా  వాస్తు ప్రకారం  నిర్మించుకొని అందరూ  సంతోషంగా  ఉండాలి. కొన్ని  ఇల్లు  చూడటానికి కళా కాంతులు లేకుండా ఉంటాయి. అలాగే కొన్నిచోట్ల అడుగు పెట్టగానే వెళ్ళగానే ఏదో తెలియని భయం గా  అనిపిస్తుంటుంది కొన్ని ఇళ్ళల్లో ఆత్మహత్య లేదా  హత్య లు  జరిగి ఉండవచ్చు.  ఇలాంటి సంఘటనలు జరిగినచోట కొన్ని ఇబ్బందులు  ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఆ పిశాచాలు అక్కడ తిష్ట వేసుకుని    లేకపోయినా కొన్ని చికాకులు కలుగుతుంటాయి. అంతకు ముందు జరిగింది మనకు తెలియకపోయిన కూడా మనం అక్కడ అడుగు పెట్టగానే మన లో అంతర్లీనంగా ఉన్న శక్తి వాటిని పసిగట్టి మీకు తెలియ చేస్తుంటుంది.  అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఇళ్ల లో  ఇలాంటి  సమస్యలు వచ్చిన ఒక పట్టాన  వలన వదిలి వెళ్ళలేము.  అలాంటప్పుడు  అనుభవజ్ఞులైన జ్యోతిష,వాస్తు  పండితుల ను  పిలిపించి లోపాలేమిటో తెలుసుకుని తగిన పంచలోహ మత్స్యయంత్రాన్ని ఇంటి నాలుగు దిక్కులలో స్థాపితం చేసి,  తగిన హోమం  శాంతి చేయించుకుంటే సరిపోతుంది.


Share

Related posts

వాళ్లిద్దరి విషయంలో ఎప్పుడూ లేనంత కోపంగా ఉన్న జగన్!

CMR

MaheshBabu – Trivikram: మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మరో క్లాసిక్..!!

bharani jella

బార్ యజమానులకు సర్కార్ షాక్

somaraju sharma