NewsOrbit
న్యూస్ సినిమా

ఆచార్య విషయంలో కొరటాల ప్లాన్ ఇదే అయితే బాహుబలి ని మించిపోవడం ఖాయం..?

Share

మెగాస్టార్ చిరంజీవి – తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి కొన్ని నిముషాలు అలా స్క్రీన్ మీద కనిపిస్తేనే థియోటర్స్ దద్దరిలీపోయాయి.. మోత మోగిపోయాయి. అలాంటిది మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కలిసి దాదాపు 30 నిముషాల పాటు స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుంది…! ఇద్దరు కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటుంటే ఎలా ఉంటుంది.. ఇద్దరిని ఒకే పోస్టర్ లో చూస్తే ఎలా ఉంటుంది… ఒకే టీజర్.. ఒకే ట్రైలర్ … ఇలా చెప్పడానికే పిచ్చ ఎగ్జైటింగ్ గా ఉంటే ఇక డైరెక్ట్ గా చూస్తే మెగా ఫ్యాన్స్ కి ఎలా ఉంటుంది …కామన్ ఆడియన్స్ కి ఎలా ఉంటుంది.. యావత్ తెలుగు ప్రేక్షకులకి ఎలా ఉంటుందో .. ఇదే ఇప్పుడు ఆచార్య సినిమా విషయంలో అందరి ఆలోచన.

Mythri Backs Koratala Siva In 'Copy' Allegations | Gulte - Latest Andhra  Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి – కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ 30 నిముషాల పాటు కనిపించే కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. అలాగే తెలుగు, హిందీ సినిమాలలో విపరీతమైన క్రేజ్ ఉన్న సోనూసూద్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ మీదకి వెళ్ళిన ఈ సినిమా సమ్మర్ కి రిలీజ్ చేసే దిశగా షూటింగ్ జరుగుతోంది. మరో రెండు మూడు రోజుల్లో మెగాస్టార్ తో పాటు సోనూసూద్.. అలాగే డిసెంబర్ రెండవ వారం లేదా మూడవ వారం నుంచి కాజల్ అగర్వాల్ ఆచార్య షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు.

అంటే ఇక ఆచార్య జెట్ స్పీడ్ లో టాకీపార్ట్ కంప్లీట్ అవుతుందని అర్థమవుతోంది. ఇక ఇప్పటికే 40 శాతం షూటింగ్ తో పాటు ఒక సాంగ్ కూడా కంప్లీటయింది కాబట్టి మిగిలింది సగ భాగమే టాకీ పార్ట్ .. 4 పాటలు. కాబట్టి ఖచ్చితంగా సమ్మర్ కి రావడం పక్కా అని మెగా ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు బాల్ చరణ్ కోర్ట్ లో ఉంది. చరణ్ ఎప్పుడు ఆచార్య షూటింగ్ లో జాయిన్ అవుతాడో తెలిస్తే మరింత క్లారిటీ వచ్చేస్తుంది. అంతేకదు కొరటాల ఈ సినిమా కోసం పబ్లిసిటీ విషయంలో చాలా కొత్త రకమైన ప్లాన్ తో రావాలని చూస్తున్నారట. అదే గనక జరిగితే బాహుబలి కంటే పెద్ద హిట్ గా ఆచార్య నిలుస్తుందని అంటున్నారు.


Share

Related posts

Tingling sensation: కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా..!? నీళ్లలో ఇది వేసుకుని తాగండి..

bharani jella

Bigg Boss 5 Telugu: సిరి.. షణ్ముఖ్ మధ్య చిచ్చుపెట్టిన బిగ్ బాస్..??

sekhar

Intermediate exams: పరీక్షలు రద్దు అయిన ఇంటర్ విద్యార్థులని ఎలా ప్రమోట్ చేస్తారు?

arun kanna