NewsOrbit
న్యూస్

ఇది నిజంగా జరిగితే జగన్ ప్రభుత్వం పరువు మొత్తం పోయినట్లే !

కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గకుండానే ఆంధ్ర ప్రదేశ్ లో సెప్టెంబర్ ఐదో తేదీ నుండి పాఠశాలలను పున ప్రారంభించాలన్న జగన్ ప్రభుత్వ యోచనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం, స్కూల్ బ్యాగులకు వైసీపీ రంగులు వేయాలన్న ఆలోచనలో కూడా జగన్ ప్రభుత్వం ఉందని ఒక టాక్ .దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి . తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏకిపారేశారు.కరువు సమయంలో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడటం తగదని ఆమె హితవుపలికారు .ఇప్పటికే కరోనా ను తుగ్లక్ ముఖ్యమంత్రి కట్టడి చేయలేక పోవడంతో దాదాపు నాలుగు వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె దుయ్యబట్టారు .కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గని ఈ సమయంలో స్కూళ్లు గనక ఓపెన్ చేసినట్లయితే పిల్లల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడగల దన్నారు.

పిల్లల భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వానికి అంత శ్రద్ధ ఉంటే వారందరికీ సెల్ఫోన్ లిచ్చి ఆన్లైన్ పాఠాలు నేర్పించాలని అని అనిత సలహా ఇచ్చారు!అసలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కరోనా బారిన పడి చికిత్స పొందుతుంటే ఇంకా పాఠశాలల పున ప్రారంభం యోచన ఏమిటని ఆమె ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు. అదే సమయంలో ఆమె ఒక కొత్త విషయాన్ని కూడా బయటపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకిచ్చే యూనిఫామ్ పుస్తకాల బ్యాంకులపై వైసిపి రంగులు ముద్రించే యోచన లో జగన్ ప్రభుత్వం ఉందన్నారు.

సంక్షోభ సమయంలో కూడా స్వలాభం చూసుకునే ప్రభుత్వం జగన్ ది తప్ప మరొకటి ఉండదన్నారు.ప్రతిపక్షాలు విమర్శించాయని కాదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలు పున ప్రారంభించక పోవడమే మంచిదని విద్యారంగ నిపుణులు కూడా చెబుతున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలను ప్రారంభించినట్లయితే కరోనా వ్యాధి మరింతగా వ్యాప్తి చెందగలదని వారు హెచ్చరిస్తున్నారు.అదే సమయంలో విద్యార్థుల యూనిఫాములు స్కూలు బ్యాగులకు వైసీపీ రంగులు వేసినట్టయితే అది మరో వివాదానికి దారితీయగలదు. ఇప్పటికే గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేసి హైకోర్టు చేత జగన్ ప్రభుత్వం మొట్టికాయలు తిని నానా రభస జరిగిన విషయం తెలిసిందే. ఇంత జరిగాక కూడా ఇంకా వైసీపీ కి రంగుల పిచ్చి పోకుంటే ఇక ఎవరూ ఏమీ చేయలేరు !

 

author avatar
Yandamuri

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju