Money: మీరు కొంత కొంత డబ్బు పొదుపు చేసి దాచుకోవాలి అని అనుకుంటే ఆ పని భరణీ నక్షత్రం ఉన్నప్పుడు మొదలు పెట్టండి.మీ చేతిలో డబ్బు అసలు నిలవడం లేదా? అయితే మీకు వచ్చిన డబ్బులో పదిశాతం దానధర్మాలు చేయడానికి వినియోగించండి.అవసరాల వరకు డబ్బు ఉండి ఇంకా ఒక్క రూపాయి కూడా మిగలక పోతే మీ కుల దైవం కి మొక్కులు తీర్చుకోండి.
డబ్బు కు ఎపుడూ ఇబ్బందిగా ఉంటుంది అని అనిపిస్తే చిన్న పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు ఎక్కువ సార్లు పంచిపెడితే మంచిది .
అమావాస్య తిథిలో జన్మించిన అమ్మాయి ని పెళ్లి అయిన తర్వాత అత్తవారింటికి పంపే ముందు కాళ్ళకు పారాణి పెట్టి ఒక తెల్లని వస్త్రం మీద పాదముద్రలు తీసుకుని ఆ వస్త్రాన్ని డబ్బు పెట్టే బీరువాలో పెట్టుకోండి .వంటగది ఆగ్నేయంలో మాత్రమే కట్టండి. వంట చేసే వారి ముఖం ఎప్పుడు తూర్పు దిక్కును చూస్తూ ఉండాలి. వంట ముగించిన తర్వాత కాస్త అన్నం ఆవుకి ,కుక్కకి లేదా కాకులకు తీసి పక్కన పెట్టడం మరువకండి. కుదిరినప్పుడల్లా చీమలకు బెల్లం,లేదా చక్కెర వేస్తూండండి. మీ ఇంట్లో పెట్టుకున్న భగవంతుని ఫోటోలు, అలాగే చనిపోయిన వ్యక్తు ల ఫోటో పై అష్ట గంధాన్ని నీటిలో కలిపి చిలకరించండి. ఉదయాన్నే ఇంటి నుంచి యజమాని బయటకు వెళ్లేముందు ఇల్లు వాకిలి ఖచ్చితంగా ఊడ్చి ఉండాలి .
అలాగే యజమాని కొంచెం బెల్లం ముక్క తిని లేదా గ్లాస్ మంచినీళ్ళు తాగి కానీ బయటకు వెళ్లడం మంచిది.తెల్లని వస్త్రాలు దానం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది.పేదవారికి భోజనం , బట్టలు ఇవ్వడానికి ప్రయత్నించండి.అలాగే వికలాంగుల సేవ చేయండి.ధనానికి సంబంధించిన ఏ పనులు అయినా సోమవారం చేసుకోండి. సుమంగళి ఎప్పుడు పాపిట బొట్టు తోనే కనిపించాలి మగవారు ఉదయం లేవగానే దానిని చూడడం చాలా శుభప్రదం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?