త్రివిక్రమ్ అనుకున్నది వర్కౌట్ అవకపోతే ఎన్టీఆర్ సినిమా వదిలేస్తాడా ..?

అరవింద సమేత .. అల వైకుంఠపురములో.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ అందుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ముఖ్యంగా అల వైకుంఠపురములో మొదలైనప్పటి నుంచి కాపీ కథ అన్న కామెంట్స్ వచ్చినప్పటికి ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. దాంతో మళ్ళీ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమా కావడం తో పాన్ ఇండియన్ రేంజ్ లో స్క్రిప్ట్ రాసినట్టు సమాచారం. హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కాల్సి ఉండగా “అయినను పోయిరావలె హసినకు” అన్న టైటిల్ ప్రచారంలో ఉంది.

NTR 30 Movie | Cast, Release Date, Trailer, Posters, Reviews, News, Photos & Videos | Moviekoop

కాగా తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు త్రివిక్రమ్..ఎన్టీఆర్ కంటే ముందు మరో సినిమా చేయాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ హీరోనే రామ్. ఇక త్రివిక్రమ్ ఇలా డిసైడవడానికి కారణం ఆర్ ఆర్ ఆర్ అని అంటున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తికాకపోవడంతో పాటు ఈ సినిమా రిలీజైయ్యే వరకు తారక్, చరణ్ లు గెటప్ మార్చకూడదన్న కండీషన్ పెట్టారట.

దాంతో మరో నాలుగైదు నెలలు ఎన్టీఆర్ ..త్రివిక్రమ్ కి దొరకడం కష్టమే. అందుకే ఈ గ్యాప్ లో త్రివిక్రమ్.. రామ్ తో ఒక సినిమా కంప్లీట్ చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం రామ్ రెడ్ సినిమా కంప్లీట్ చేసి ఉన్నాడు. ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది అనౌన్స్ చేయలేదు. అందుకే త్రివిక్రమ్ – రామ్ కాంబినేషన్ లో త్వరలో ఒక సినిమా మొదలవనుందని సమాచారం. తారక్ ఫ్రీ అయ్యే లోపు త్రివిక్రమ్ ఈ సినిమాని కంప్లీట్ చేసేయ్యాలి. లేదంటే తారక్ నెక్స్ట్ సినిమా కే.జీ.ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కమిటయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే ఇక త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో లేనట్టే.