వకీల్ సాబ్ లో చేసిన మార్పులు చేర్పులతో సినిమా హిట్ అయితే క్రెడిట్ అంతా ఆఒక్కడికే ..!

వకీల్ సాబ్ సినిమాలో మార్పులు చేర్పులు బాగానే చేసినట్టు తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూసిన ప్రతీ ఒక్కరికీ తెలుస్తోంది. బాలీవుడ్ pink సినిమాలో అమితాబ్ ఏజ్ కి తగ్గట్టు కథ కథనం సాగుతుంది. ఒరిజినల్ వెర్షన్ లో ఫైట్స్ గాని సాంగ్స్ గాని ఉండవు. కథ మొత్తం ముగ్గురు అమ్మాయిలు.. కోర్ట్.. అమితాబ్ చుట్టూనే తిరుగుతుంది. అయితే pink కథ తమిళ వెర్షన్ కి వెళ్ళేసరికి బాగానే మార్పులు చేశాడు దర్శకుడు హెచ్ వినోద్. నేర్కొండ పార్వై గా అజిత్ తో అక్కడ బోనీకపూర్ నిర్మించాడు.

అజిత్ ఇమేజ్ కి తగ్గట్టు తమిళ వర్షన్ లో ఫైట్స్ యాడ్ చేశారు. ఇక vakeel saab గా ఇదే సినిమాని దిల్ రాజు తెలుగులో నిర్మిస్తున్న సంగతి తెలీసందే. కాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ తెరకెక్కింది. పింక్ సినిమా కథ ని కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఇక్కడ pawan kalyan తో తెరకెక్కించాడు. ఈ మార్పులు చేర్పులు కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్ఠిలో పెట్టుకొని ఆయన అభిమానులకి ఏం కావాలో అలా రూపొందించాడు. ఈ విషయం టీజర్ తో అర్థమైపోయింది.

అయితే ఈ మార్పులతో సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు వేణు శ్రీరామ్ కే వెళుతుంది. గతంలో కూడా గబ్బర్ సింగ్ సినిమాని దబాంగ్ ఆధారంగా తెరకెక్కించగా దర్శకుడు హరీష్ శంకర్ తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశాడు. టైటిల్ కార్డ్ లో కూడా అదే వేసుకున్నాడు. ఆ సినిమా ఎంతటి హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. అదే ఇప్పుడు vakeel saab కి రిపీటవబోతోంది అని అంటున్నారు. చూడాలి మరి వకీల్ సాబ్ రిజల్ట్ ఎలా ఉంటుందో.