ఏప్రిల్ నెలలో పుట్టిన స్త్రీ పురుషులందరికి ఈ ఫలితములు వర్తిస్తాయి.. ఈ నెలలో పుట్టినవారందారు స్వతంత్ర భావాల కలిగి ఉంటారు . దేని కోసం ఎవ్వరి మీద ఆధారపడే స్వభవం వీరికి ఉండదు. వారిపనులు వారే స్వయం గా చేసుకుంటారు. ఇతరులను అనుకరించడం లాంటివి అస్సలు ఉండవు. అలా గే తమ పనుల్లో ఇతరుల జోక్యాన్ని కూడా అంగీకరించరు. ఇతరులను అధిగమించగల నేర్పరులు.
ఈ నెలలో పుట్టినవారు మంచి శక్తి వంతులు. తెలివితేటలూ, చురుకుదనం కలిగినవారు. కోపం ఎక్కువనే చేప్పాలి.వీరు ఇతరులకు సలహాలు ఇచ్చి నడిపించే స్థాయిలో ఉంటారు. మానసిక శక్తి ,ధైర్యం చాల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో వదిలేయడం అన్నది అస్సలు ఉండదు. పని పూర్తి అయ్యేవరకు వదలరు. ప్రతి విషయం లో ముక్కు సూటిగా నిజాయితీగా ఉంటారు. నిజాయితీ కోసం శతృత్వాని కూడా ఎదురు కుంటారు.
డబ్బు ,సమాజం లో ఒక స్థాయి రెండిటిని సంపాదించేవరకు వదిలి పెట్టరు . వీరు ఇంటిలో ,ఆఫీస్ లో వ్యాపారసంస్థ లందు మొదటి స్థానం లో ఉంటారు. ఉండాలని ఆశపడతారు. జీవితం తృప్తిగా గడుస్తుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. ఇబ్బందులు ఉండవు. పరస్పర అవగాహనతో ఉంటారు. వీరు మంచి శక్తి వంతులు గా ఇతరులకు దారి చూపే మార్గదరసకులుగా ఉంటారు. పని యే దేవుడుగా భవించి చేస్తారు. కాబట్టి వీరికి అన్నిటా విజయం దక్కుతుంది.
ఈ నెలలో పుట్టినవారికి సహజం గా కంటి ,పంటి , చెవికి సంబందించిన రోగములు వస్తాయి. జ్వరము, తలపోటు వంటి రోగములు ఎక్కువగా బాధిస్తాయి . బాగా సంపాదిస్తారు. అనుకోకుండా ధన నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయినా తట్టుకుని నిలబడతారు. మొత్తానికి వీరు అన్నిటిలో అన్నివిధాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలిసిందే..ఏప్రిల్ నెలలో పుట్టినవారికి సోమవారం,శుక్రవారంఅదృష్టమునిచ్చు వారములుమంగళ,గురువారములు కూడా లాభం చేస్తాయి.రోజ్కలర్,పింక్ కలర్ దుస్తులు వీరికి శుభాన్ని ఇస్తాయి.