మర్చి నెలలో పుట్టిన స్త్రీ,పురుషుల గుణ గణాలు ఆర్ధికస్థితి ఆలోచన విధానం ఎలాఉంటుంది? వంటి విషయాలగురించి తెలుసుకుందాం .. కొంచెం గర్వం ఎక్కువ తొందర పడుతుంటారు ఇతరుల కోపానికి గురి అవుతారు. అందువల్ల వీరితో స్నేహం ఎక్కువకాలం నిలవదు. ఈ నెలలో పుట్టినవారికి జాలి ప్రేమ తక్కువ. సాటివారికి సహాయం చేయరు గొప్పలు చెపుతూ ఉంటారు. ఈ నెలలో పుట్టినవారు రాజకీయాలలో, పెద్ద పెద్ద ఉడ్జ్యోగాలలో ఉంటారు. స్వతంత్రత ఎక్కువ, గొప్ప గొప్ప ఆలోచనలు చేసి వాటిని ఆచరణ లో పెట్టి విజయం సంధిస్తుంటారు. కోపం ఎక్కువ. వీరికి సంసార జీవితం అంతగా సంతృప్తి గా ఉండదు. సంసార సుఖం పొందలేరు. ఎదుటి వారి పొగడ్తలకు లొంగి వారి పనులు చేసిపెడుతుంటారు.మంచిఆలోచలపరులుగా కూడా ఉంటారు.కాస్త జాగ్రత్త ఎక్కువ. నిర్మొహమాటం గా మాట్లాడతారు.
శతృత్వం కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఎవరిని లెక్కచేయారు. వ్యాపారాలు చేసిన కూడా కలిసి వస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. ఇతరుల వలన లాభం పొందుతారు. ముఖ్యం వీరికి 37 సంత్సరాల నుండి బాగా కలిసి వస్తుంది. మంచి అభివృద్ధి చెంది సుఖ పడతారు. తలనొప్పి ,నేత్ర వ్యాధులు రావచ్చు. ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంది. బాగా డబ్బు సంపాదిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. వీరికి మంగళవారం, గురువారం , శుక్రవారం మంచి అదృష్టాన్ని ఇస్తాయి. పసుపు రంగు ,బంగారు వర్ణం,ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం వల్ల లాభం కలుగుతుంది.
పొగడ్తలు అంటే చాలా ప్రీతి దీని కారణం గా వీరు బయట సమాజములోనూ, అయినవారితోనూ చివరకు తన సంసారము లోనూ సమస్యలు కోరి తెచ్చుకుంటారు. అనుకోని పరిస్థితులలో సంసారం కూడా విచ్చిన్నం కావచ్చు.కాబట్టి బాగా అలోచించి
ముందుగా తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది..