నైట్ షిఫ్ట్ వలన మీ శరీరం దాని సహజ షెడ్యూల్ ని వదులుకుని విరుద్ధంగా పనిచేయవలసి వస్తుంది. ఈ నైట్ షిఫ్ట్ లో మీ శరీరాన్ని పగటిపూట నిద్రించడానికి మరియు రాత్రి సమయంలో మెలకువగా ఉంచడానికి అలవాటు చెయ్యాలిసి ఉంటుంది. ఈ రీట్ట్రైనింగ్ ను మీరు మీ శరీరానికి సరిగ్గా అలవాటు చేసుకోకపోతే మీరు చాలా ఆరోగ్య సమస్యలను ఎదురుకోవలిసి ఉంటుంది. నైట్ షిఫ్ట్ మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చుడండి.
1) సహజ నిద్ర షెడ్యూల్ మారిపోతుంది.
2) రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది
3) గుండెపోటు మరియు డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతుంది
4)ఊబకాయం మరియు డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది
నైట్ షిఫ్ట్ చేసే వారికోసం కొన్నిచిట్కాలు:
పగటిపూట లేదా రాత్రివేళ అయినా పని తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఒక గంట సమయం కేటాయించండి. విశ్రాంతి కోసం సంగీతం లేదా వేడి నీటి స్నానం సహాయపడుతుంది.
మిమ్మల్ని ఫోకస్డ్ గా ఉంచడానికి అధిక ప్రోటీన్ ఆహారాలు (కూరగాయలు, వేరుశెనగ వెన్న, పండ్లు మొదలైనవి) తినండి. మీ షిఫ్ట్ అయిపోయాక మంచి నిద్రకోసం మీరు స్వీట్స్ తీసుకోవచ్చు
పడుకునేముందు మద్యం మానుకోండి.
నిద్రపోయే ముందు కాఫీ, టీ, కోలాస్, అన్ని ఇతర కెఫిన్ పానీయాలు మానుకోండి, ఇవి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. కాఫీ బదులుగా, నారింజ రసం తాగండి మరియు నడకకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.
ఖాళీ కడుపుతో నిద్రపోకండి. మీకు ఎక్కువ తినాలని అనిపించకపోతే, ఒక గ్లాసు పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోండి ఇవి మీకు మంచి నిద్రను ఇస్తాయి.