న్యూస్

గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే ప్రాణమేపోయింది!వాహనదారులారా బహుపరాక్ !!

Share

ఎక్కడైనా దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఎలా వెళ్లాలో తెలియదు. అందుకే చాలామంది గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతుంటారు. కానీ కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ తప్పుగా చూపించి ఇబ్బందిపెడుతుంటాయి. అందుకే పూర్తిగా అవగాహన ఉంటే తప్ప గూగుల్ మ్యాప్స్ ఫాలో కాకూడదు.

ఒక లొకేషన్ పెడితే మరో లొకేషన్ చూపిస్తుంటాయి. లేదంటే మార్గం తప్పిపోవచ్చు.. లేదా ప్రమాదాలే జరగొచ్చు.. గూగుల్ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మొద్దు.. తొందరగా గమ్యాన్ని చేరుకోవాలన్న తొందరలో గూగుల్ మ్యాప్స్ డైరెక్షన్స్ నమ్ముకుంటే కొన్నిసార్లు తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి.అందులోనూ చీకట్లో వాహనంలో గూగుల్ మ్యాప్స్ ఫాలో అయ్యేటప్పుడు కాస్తా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇలా ఫాలో అయిన ఓ వ్యక్తికి గూగుల్ మ్యాప్స్ తప్పుగా చూపించి అతడి ప్రాణాలు తీసింది. రాత్రివేళలో డ్రైవ్ చేస్తున్న అతడు గూగుల్ మ్యాప్స్ చూపించినట్టుగా డ్రైవింగ్ చేశాడు. అంతే.. కట్ చేస్తే డ్యామ్‌లోకి వాహనం దూసుకుపోయింది. ఆ మార్గంలో డ్యామ్ ఉంది. ఆ విషయం తెలియక అతడు అలానే డ్రైవ్ చేశాడు. డ్యామ్ లో వాహనం పడిపోయింది. నీటిలో మునిగిన అతడు ఈతరాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు.

ట్రెక్కీలకు తప్పుదోవ చూపిన గూగుల్ మ్యాప్!

పుణెకు చెందిన గురు శేఖర్ (42) స్నేహితులతో కలిసి కారులో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. డ్రైవర్ సతీష్‌, స్నేహితుడు సమీర్, మరో వ్యక్తితో కలిసి మహారాష్ట్రలోని అత్యంత ఎత్తైన ప్రదేశం కల్సుబాయ్ పైకి ట్రెక్కింగ్ కోసం వెళ్లారు. మధ్యలో దారి తప్పిపోయి గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో అయ్యారు. రాంగ్‌ రూట్ చూపించింది గూగుల్ మ్యాప్స్. అప్పటికే చీకటి పడింది. గూగుల్ మ్యాప్స్ ఫాలో అయిపోతే సరిపోతుంది కదాని ధైర్యంతో ముందుకు సాగారు. డ్యామ్ దగ్గరకు కారు చేరుకుంది. చీకట్లో అక్కడ బ్రిడ్జి ఉందనుకున్నారు. కారును ముందుకు డ్రైవింగ్ చేస్తూ వెళ్లారు. కారు క్షణాల్లో నీటిలో కొట్టుకుపోయింది.అప్రమత్తమైన శేఖర్, సమీర్, కారు డోర్లను నెట్టి ఈదుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, సతీష్‌కు ఈత రాదు. అతడు బయటకురాలేక కారులోనే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు కారును గుర్తించారు. కారులో సతీష్‌ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అందుకే.. అందులోనూ రాత్రి డ్రైవింగ్ చేసే సమయాల్లో గూగుల్ మ్యాప్స్ విషయంలో వాహనదారులను కాస్తా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. లేదంటే ఇలానే ప్రమాదాల బారినపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

 


Share

Related posts

‘ఆ వార్తలు నిజం కాదు’

somaraju sharma

Gruhalakshmi: అనుకున్నంత అయిపోయింది.. పాపం తులసి గమనం ఎటువైపో..? గుండెల్ని మెలిపెట్టే సీన్.. !

Ram

భద్రత కట్టుదిట్టం

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar