Dhana Triodashi: ధన త్రయోదశి రోజు  ఇలా చేసారంటే .. జీవితం లో లోటు అనేది ఉండదు!!

Share

Dhana Triodashi: త్రయోదశి రోజు తెల్లవారు ఝామున
మన ఇంట్లో అందరు ఆయుఃఆరోగ్యాలతో సంపదతో సుఖం గా ఉండాలి అంటే   ధన త్రయోదశి (Dhana Triodashi) రోజు యముడికి దీపం పెట్టాలి. ఈ రోజు  లక్ష్మి అమ్మవారి కి ,ఆయుర్వేద భగవానుడు ఈ ధన త్రయోదశి కి ముందు రోజే    ఇల్లంతా బూజులు,దుమ్ము ధూళి లేకుండా శుభ్రం చేసుకోవాలి. ధన త్రయోదశి రోజు తెల్లవారు ఝామున నిద్ర లేచి తల స్నానం చేసి . లక్ష్మి అమ్మవారికి అష్టోత్తరం (Asthotaram)  తో పూజ చేస్తుకోవాలి. కుబేర మంత్రం కూడా చదువుకోవాలి. ఆరోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత అపమృత్యు భయం నివారణార్థం  యమ దీపం పెట్టాలి.. ఈ దీపం ఎలా పెట్టాలో తెలుసుకుందాం


Dhana Triodashi: ధనత్రయోదశి నాడు యమధర్మరాజు

ఈ యమ దీపాన్ని  గుమ్మానికి  బయట పక్కన పెట్టి వెలిగించుకోవాలి. సాయంత్రం చీకటి పడకముందు అంటే 5. 30 కి  వెలిగించాలి. కనీసం 8 గంటలవరకు వెలిగేలా చూసుకోవాలి ముందుగా దీపం పెట్టె స్థలాన్ని శుభ్రం చేసుకుని కుబేర ముగ్గు వేసుకోవాలి. అది ఎలా మాకు తెలియదు అనుకోకండి. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండగా ఏదైనా తేలికగా తెలుసుకోవచ్చు. అలా కుబేర ముగ్గు వెసలుకుని పసుపు ,కుంకుమ పువ్వులతో ఆ ముగ్గుని అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఆ ముగ్గు మీద కాస్తంత కల్లు ఉప్పు వేసి పరచాలి.    రెండు ప్రమిదెల కు పసుపు రాసి బొట్టు పెట్టి ఒకదానిలో ఒకటి పెట్టి  నువ్వుల నూనె   వేసి … ఆరు వత్తులను తీసుకుని వాటిని మూడు వత్తులుగా చేసుకుని ప్రమిదె లో వేసుకుని ఆ   ప్రమిదెని ముగ్గులో వేసుకున్న ఉప్పుమీద పెట్టుకోవాలి . ఇప్పుడు ఆ యమ ధర్మ రాజుని తలచుకుని ఇంట్లో అందరికి  సమస్త దోషాలు ,అపమృత్యు దోషం తొలగించ ప్రార్ధించాలి.ఆ తర్వాత ఆ దీపం దగ్గర ఒక గవ్వ ,ఒక రాగి నాణం పెట్టాలి. కొన్ని పాలు ,కొంచెం బెల్లం ముక్క ,కొన్ని బియ్యం వేరు వేరుగా పెట్టి నివేదించాలి.  అలా ఈ దీపాన్ని 5 రోజులు లేదా కార్తీకం అంతా కూడా వెలిగించుకోవచ్చు. ఇది పితృ దేవతలకు దారి చూపుతుంది. ఈ ఫలితం గా వారి ఆశీర్వచనం కూడా మనకు అందుతుంది.

ఈ దీపం వెలిగించాక ఈ కథ వినాలి.  ధనత్రయోదశి నాడు యమధర్మరాజు   కథ చెప్పుకుంటారు. హేమరాజుకు లేక లేక కొడుకు పుడతాడు. ఆ  యువరాజు  తన పదహారో ఏట, వివాహమైన నాలుగో రోజున పాము కాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెబుతారు. ఎవ్వరికి చెప్పకుండా ఎవరాజు ఒకామెనీ పెళ్ళిచేసుకుని తీసుకువస్తాడు. అప్పుడు ఆమెకి భర్తకు ఉన్న గండం గురించి తెలుస్తుంది.  భర్త ప్రాణాలు కాపాడుకొనేందుకై ఆ భార్య వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది. బంగారం, వెండి, రత్నాల్ని రాశులుగా పోసి ఉంచి, ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథారూపంలో గానం చేస్తుంది. యువరాజు ప్రాణం కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీప కాంతికి బంగారు వెండి ధగధగలకూ కళ్ళు మిరుమిట్లు కొలిపాయి. కళ్లు చెదిరి కదలకండా ఉండిపోయి వచ్చిన పని మరచిపో పోయి తెల్లారగానే తిరిగి వెళ్లిపోవడం తో ఆమె భర్త ప్రాణాలు దక్కుతాయి. అందుకే   సౌభాగ్యానికి ఐశ్వర్యానికి ధన త్రయోదశిని సూచికగా భావిస్తాం. ఈ కథ కూడా తప్పకుండ చదువుకోవాలి.


తీపి పదార్ధం నై వేద్యం గా

సుఖశాంతులు అన్నింటినీ అందించేది ధనత్రయోదశి పూజ. దీపం కొండెక్కాకా గవ్వ ,రాగినాణం తీసుకుని మనం డబ్బు దాచుకునే లాకర్ లో పెట్టుకోవాలి . ప్రమీద దేముడి దగ్గర కాకుండా బయట అలంకారం కోసం వాడే ప్రమిదగా వాడుకోవచ్చు. మిగిలినవి అన్ని చెట్టు మొదటిలో వేసేయాలి.  బెల్లం,పాలు ప్రసాదం తీసుకోవచ్చు. ఆ తర్వాత యధావిధిగా ఇంటీలో అమ్మవారి పూజ చేసుకుంటూ.. అమ్మవారి నామాలతో పాటు ధన్వంతరి భగవానుడి నామాలు కూడా చదువుకుని తీపి పదార్ధం నై వేద్యం గా పెట్టాలి.ఇలా ధన త్రయోదశి రోజు గడపాలి. బంగారం ,వెండి ఆ రోజు అస్సలు కొనుక్కోకూడదు అని గుర్తు పెట్టుకోండి. మీకు ఉన్న నగలు శుభ్రం గా నీటితో కడిగి పొడి వస్త్రం తో తుడిచి ఒక ఇత్తడి లేదా రాగి ప్లేట్ లో పెట్టి అమ్మవారి ముందు ఉంచితే చాలు. ఈ విధం గా ధనత్రయో దశి  ముగించాలి. బాగా గుర్తు పెట్టుకోండి బంగారం ఎట్టి పరిస్థితుల లో కూడా కొనకండి. అంతగా కావాలంటే తర్వాత రోజు కొనుక్కోండి.


Share

Related posts

Restaurant: సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్ … ఆ రెస్టారెంట్ లో సైలెంట్ గా తినాలి లేదంటే జైల్లో పడేస్తారు

Naina

Chiranjeevi: బాక్సాఫీస్ ను రఫ్ఫాడేసిన చిరంజీవి.. ‘గ్యాంగ్ లీడర్’ కు 30 ఏళ్లు..

Muraliak

Balakrishna : బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చేస్తోంది ..!

GRK