కోడి గుడ్డు లో బోలెడన్ని పోషక పదార్ధాలు , ప్రొటీన్లు, కొలైన్ల ఉన్నాయి .రోజుకు ఒక గుడ్డు ప్రతి వయస్సు వారు తినాలని వైద్యులు చెబుతున్నారు. ఇందులో అరుదైన లవణాలతో పాటు అయోడిన్, ఫాస్పరస్, ఐరన్,సెలీనియం, జింక్ ఉంటాయి. వీటి వలన శరీరానికి మేలుజరుగుతుంది. కోడి గుడ్డు తినడం వలన కంటి చూపు మెరుగవుతుంది. రోజు గుడ్డు తినేవారికి కంటి శుక్లాలు వచ్చే అవకాశం బాగా తక్కువ.
బరువు తగ్గడం లో గుడ్డు బాగా సహాయ పడుతుంది. గుడ్డు లో ఉన్న ప్రోటీన్ల వల్ల గుడ్డు తిన్నాక కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీనితో ఎక్కువ ఆహారం తీసుకోలేము కాబట్టి బరువు తగ్గుతాము.
గుడ్డు లో ఉన్న ఐరన్ ని శరీరం చాలా సులభంగా గ్రహిస్తుంది. గుడ్డు గర్భిణీ స్త్రీ లకు, బాలింత లకు ఎంతో మేలు చేస్తుంది.
గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదై న కూడా మితం గా నే తీసుకోవాలి. ప్రతి రోజు రెండు కోడిగుడ్లు కన్నా ఎక్కువతింటే గుండె కు ప్రమాదమని తాజా సర్వే హెచ్చరిస్తోంది. అమెరికా వ్యవసాయశాఖ తెలియచేసిన ఈ వివరాలను అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్లో ప్రచురించ బడ్డాయి. దాదాపు 30వేల మంది మీద 31ఏళ్లుగా తీసుకుంటున్న ఆహారం, వారి జీవన విధానంపై పరిశోధనలు జరిపినట్టుగా తెలిపారు.
కోడి గుడ్లలో కొవ్వు ఉంటుందని, దీనిని రోజూ అతిగా తీసుకుంటే ప్రమాదమని మసాచుసెట్స్ యూనివర్సిటీ కిచెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక్కో గుడ్డులో 200 మిల్లీగ్రాముల కొవ్వు ఉంటుందని, ఇది రోజుకు 300 మిల్లీగ్రాములుదాటితే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని, అకాల మరణం సంభవించే రేటు కూడా 18 శాతం ఉంటుందని తెలిపారు .