lucky person: మీకు ఈ లక్షణాలు ఉంటే మీరు చాలా అదృష్టవంతులు … మిమ్మల్ని మించిన వారు ఉండరు!!

Share

lucky person: చాలా మంది ఏ చిన్నది తక్కువ అయినా నా అదృష్టం అంతే , నా తలరాత ఇంతే, నా బ్రతుకింతే అని నిరాశ పడిపోతూ.. తమని తామే తిట్టుకుంటూ , తక్కువ చేసుకుంటూ ఇంకా ఎదో కావాలన్నా ఆశతో మానసిక వేదనకు గురవుతుంటారు. అసలు మనకున్న అదృష్టం ఏమిటో తెలుసుకోగలిగితే మాత్రం.. మనకున్న సగం అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. మన మనసులోని బాధలే మన అనారోగ్యా సమస్యలకు అసలు కారణం”. వాటిగురించి తెలుసుకుందాం.

ఈ రోజు పొద్దున్నే నువ్వు “ఏ శారీరక నొప్పులు, బాధలు లేకుండా, నిన్నేవ్వరూ లేపకుండా, నీకు నీవే ఆరోగ్యంగా నిద్ర లేవగలిగావు అంటే దేశంలో నిన్న రాత్రి అనారోగ్యం వచ్చి నరక యాతన అనుభవిస్తున్న పది లక్షల మంది తో పోలిస్తే నువ్వు చాలా గొప్ప అదృష్టవంతుడివి .
నీకు ఇంతవరకు యుద్దంలో రక్తపాతం , జైల్లో ఒంటరితనాన్ని, కరువు సమయంలో శరణార్థ శిభిరం లో ఉండేవారిని చూడలేదంటే…ప్రపంచంలో ఉన్న 200 కోట్ల అనాధల కు లేని చాలా గొప్ప అదృష్టం నీకు ఉందని తెలుసుకో
నువ్వు ఏ భయమూ లేకుండా, ఎటువంటి అయుధమూ లేకుండా, నీ చుట్టూ పది మంది అనుచరులు లేకుండా నీవు హాయిగా బయట తిరుగుతున్నావు అంటే ..300 కోట్ల మంది నివసించే దేశాలలో నువ్వు లేకపోవడం ని అదృష్టం అని గుర్తించు.నీకు కడుపు నిండా తినడానికి ఆహారం, ఒంటి నిండా బట్టలు , ఓ ఇంటి కప్పుకింద సరిపడినంత నిద్ర పోగలుగుతున్నావు అంటే ఈ భూప్రపంచంలో నివసించే 50 శాతం మంది కన్నా నీవు చాలా పెద్ద ధనవంతుడివి అని గుర్తుంచుకో.

నీ దగ్గర ఈ రోజుకి సరిపడా డబ్బుండి, నీ బ్యాంక్ బ్యాలన్స్ భవిష్యత్తు అవసరాలకు సరిపడా నిల్వ ఉన్నట్లయితే .ప్రపంచంలో 8 శాతం మాత్రమే ఉన్న ఆత్యంత ధనవంతుల్లో మీరు ఒకరు అని తెలుసుకోండి.
నీ కన్నవారు బ్రతికి ఉండి, వారింకా విడాకులు తీసుకోకుండా, నీతోనే కలిసి మెలిసి ప్రేమగా, తృప్తిగా ఉన్నారు అంటే ఈ ప్రపంచము లో ఉన్న 15 శాతం మంది అనాధ కుటుంబాలలో నిది ఒకటిగా లేనందుకు సంతోషించవచ్చు . జీవితంలో తల్లిదండ్రులు లేనివారు అనాధలు కాదు, ఉన్న తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోలేనివారు నిజమైన అనాధలు”.
నువ్వు , భార్యపిల్లలు, స్నేహితులు, ఇతర కుటుంబసభ్యులతో కలిసి హాయిగా తలెత్తుకొని గర్వంగా సమాజంలో ఉంటూ.. ఆహ్లదంగా నవ్వుతు , నీ ప్రవర్తన తో అందరి మనస్సు గెలుచుకుంటున్నావు అంటే , ఈ ప్రపంచంలో చాలా మంది చెయ్యలేనిది నువ్వు చేస్తున్నట్టే.. అది గొప్ప హీరో ఇజం కూడా.
ఈ విషయాలు అన్ని నీవు చదువుతున్నావు అంటే ప్రపంచంలోఉన్న 50 కోట్ల మంది నిరక్ష్యరాస్యుల అందరికంటే నువ్వు అదృష్టవంతుడివి .
నీలో ఇంకా నాకు అది ఉంటే బావుండు, ఇదిలేదు, ఇంకా ఏదో కావాలని అసంతృప్తి ఉందంటే , నీ అదృష్టాన్ని నువ్వు గుర్తించడం లేదని అర్ధం.
ఇప్పటికైనా తెలుసుకోండి. ఈ ప్రపంచంలో మీరెంత అదృష్టవంతులో… తృప్తి ఒక్కటి మీదగ్గర ఉంటే సమస్తం మీ పాదాలదగ్గర ఉన్నట్టే అని మరువకండి.


Share

Related posts

ఢిల్లీలో మరో ఘోర అగ్నిప్రమాదం

somaraju sharma

చివరి రోజు 10 మంది టిడిపి సభ్యులు సభ నుండి సస్పెండ్..!!

sekhar

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌తో పూరి జనగణమన..?

GRK