House: సూర్యుభగవానుడి విగ్రహం
మన పూజ గదిలో కొన్ని దేవుళ్ళ, దేవతా మూర్తులు ఫోటోలు,విగ్రహాలు ఉంచుకోకూడదు. వాటి సైజ్ ని బట్టి కూడా మనకు కొన్ని,కొన్ని సార్లు హాని జరిగేఅవకాశం ఉంది. వీటిగురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.ఇంట్లో నటరాజ స్వామి ( Nataraja Swamy ) విగ్రహం ఉండకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో అయితే నిత్యం నాట్య నివేదన జరుగుతుంటుంది కాబట్టి అక్కడ ఉండవచ్చు కానీ ఇంట్లో మాత్రం ఉండకూడదు. అలాగే సూర్యుభగవానుడి విగ్రహం కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ప్రతి రోజు అయన ప్రత్యక్షంగా దర్శనం ఇస్తారు కాబట్టి మనం కూడా అలాగే నమస్కరించుకోవాలి.
House: చేతిలో పిల్లనగ్రోవి
పంచముఖ హనుమంతుడిని ఫోటో కానీ విగ్రహం గాని ఏది పూజ కోసం ప్రత్యేకం గా గది లేని వారు ఇంట్లో పెట్టుకోకూడదు. వీటితో పాటు ఉగ్ర రూపంలో ఉన్న నరసింహ స్వామి ఫోటో, విగ్రహం ఇంట్లో పెట్టుకోకపోవడం మంచిది కాదు . ప్రహ్లాద అనుగ్రహ లక్ష్మీ నరసింహస్వామి , యోగ నరసింహస్వామి , నరసింహ స్వామి ప్రతిమల్ని పెట్టికొని పూజించవచ్చు. చేతిలో పిల్లనగ్రోవి ఉన్న కృష్ణుడు విగ్రహం ఇంట్లో పెట్టుకోకూడదు. ఆవుతో ఉన్న కృష్ణుడి ( Krishna )విగ్రహం గాని ఫొటో గాని చిన్నది ఉండవచ్చు కానీ పెద్దదిగా మాత్రం ఉండకూడదు.కొంతమంది పెద్ద పెద్ద దేవతా విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటుంటారు. విగ్రహం సైజు చాలా చిన్నదిగా ఉంటే పండో, పాలో పెట్టి హారతి ఇచ్చిన సరిపోతుంది. అదే విగ్రహాల సైజ్ పెద్దదిగా ఉంటే ప్రతి రోజు మహా నివేదన, వారంలో ఒక్కసారి అయినా అభిషేకం కచ్చితం గా చేయవలిసి ఉంటుంది. పూజలు లేకుండా పెద్ద,పెద్ద విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు.
ఇంట్లో కాళికామాత
ఇంట్లో లక్ష్మీ దేవి నిల్చుని ఉన్నట్టుగా ఉన్న ఫోటో ఉండకూడదు. లక్ష్మీ అమ్మవారు అటూఇటూ ఏనుగుల ఉండి పచ్చరంగు చీర లో ఉన్న ఫొటో కి గృహస్థులు పూజలు చేయాలి. లక్ష్మీ దేవి విగ్రహం లేదా ఫోటో ముందు కానీ ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి , అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఇంట్లో కాళికామాత , ప్రత్యంగిరా దేవి ఫోటోలు ఉండకూడదు . దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం పూజ అవగానే దేవుని అనుగ్రహం ఆ ప్రసాదం అని భావించి వెంటనే స్వీకరించాలి. ఇంట్లో నవగ్రహాల ప్రతిమలు కూడా పెట్టుకోకూడదు. గుడికి వెళ్ళినపుడు కూడా నవగ్రహాలను తాకకూడదు. నీరు, పాలు, పెరుగు, నెయ్యికి అంటు అనేది ఉండదు. అవి ఎక్కడ నుండి అయినా ఎవరి నుండి అయినా తీసుకొని దేవునికి పెట్టుకోవచ్చు.దిష్టి తగలకుండా అని ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు పెట్టుకోకూడదు. కన్నుదిష్ఠి వినాయకుడి ఫొటో లేదా దిష్టి యంత్రం గాని పెట్టుకోవడం మంచిది. ఇంటిలో పూజించుకునే వినాయకుడి విగ్రముకు తొండం ఎడమ వైపు ఉండాలి, విద్య సంస్థలలో లో ఉండే విగ్రహంకి తొండం కుడి వైపు ఉండాలి.వ్యాపారం చేసే చోట నిల్చున్న వినాయకుడు ఉండాలి.