పండగలు వచ్చాయంటే చాలు చిన్న పెద్ద అంతా కొత్త బట్టలతో మెరిసి పోతుంటారు. ఇక హీరోయిన్లు, హీరోలు అయితే ఎలా తమ ఫ్యాన్స్ ను ఆకట్టుకోవాలో అని ఆలోచిస్తుంటారు. అందుకే రకరకాల ఫ్యాషన్ దుస్తువులను వేసుకుని ఫొటోలకు ఫోజులిస్తుంటారు. ఈ పండగల పూట ఏదో రకంగా ట్రెండ్ కావాలని ఆశ పడుతుంటారు. అందుకు అనుగుణంగా కాస్టీ దూస్తువులను వేసుకుని ఫొటో షూట్ చేయించుకుంటారు. ఈ దీపావళిలో ఇలా ఒక హీరోయిన్ వేసుకున్న డ్రెస్ అందరికి ఆకట్టుకుంటోంది.
అవును మరీ అది సాదాసీదా డ్రెస్ కాదు. మధ్యతరగతి అమ్మాయిలు అంత కాస్టీ డ్రెస్ లను జీవిత కాలంలో ఒక్కసారి కూడా వేసుకోలేరేమో.. అలాంటి డ్రెస్ ను వేసుకుంది ఇప్పుడు ఒక హీరోయిన్. రాజమౌళి దర్శకత్వం వహించిన బహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. అయితే ఆ చిత్రంలో మనోహరి పాట ఎంత ఫేమస్ అయ్యిందో కూడా మనకందరికి తెలుసు కదా.. ఆ పాటలో ఆడిపాడిన కెనడా హీరోయిన్ నోరా ఫతేహి.
హిందీ సినీ ఇండస్ట్రీలో బిజీబిజీగా ఉండే ఈ భామ.. ఇప్పుడు దీపావళి పూట తను వేసుకున్న డ్రెస్ తో ట్రెండ్ లో నిలుస్తోంది. ఆ చిన్నదాని చూపులకు తెలుగు కుర్రకారు ఎప్పుడో మనసు పారేసుకున్నారు. అయితే దీపావళి సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ఒక ఫొటో షూట్ చేయించుకుంది. ఆ ఫొటోలు ఇప్పడు సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి. ఆ ఫొటోల ద్వారా ఈ చిన్నది తన ఫ్యాన్స్ కు దీపావళి శుభాకాంక్షలు కూడా తెలిపింది.
ఇక ఫొటో షూట్ విషయానికి వస్తే తరుణ్ తహిల్యాని అనే డిజైనర్ డిజైన్ చేసిన గోల్డ్ కలర్ లెహంగా ను షూట్ లో ధరించింది ఈ ముద్దుగుమ్మ. దీపాల కాంతుల మధ్య ఈ లెహంగా ఆమెకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. దాంతో ఈ ఫొటోలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ముద్దుగుమ్మ వేసుకున్న లెహంగా ధర తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తనకు డిజైన్ చేసిన డిజైనర్ కు సంబంధించిన వెబ్ సైట్ లో ఆమె వేసుకున్న డ్రెస్ ధరను చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. మరీ కాక ఊరుకుంటారా..? ఆ డ్రెస్ ధర అక్షరాల రూ. 1,99,900. అమ్మో.. లెహంగాకు ఇంత రేటా అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటారు.