ఇష్టం సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రియా శరణ్ ఎన్నో అద్భుతమైన సినిమాలు చేస్తూ విజయవంతంగా 20 ఏళ్ళు పూర్తి చేసింది. హీరోయిన్ గానే సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్ల నుంచి కొనసాగుతున్న శ్రియా శరణ్ యంగ్ హీరోలతో పాటు మెగాస్టార్, రజనీకాంత్, వెంకటేష్, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోలతో నటించి ఇప్పటికే అదే క్రేజ్ ని మేయిటైన్ చేస్తుంది.
ప్రస్తుతం దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కి జంటగా నటిస్తుంది. ఈ సినిమా తో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని అంటున్నారు. అందులో ముఖ్యంగా నితిన్ నటించబోతున్న బాలీవుడ్ హిట్ సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ ఉందని సమాచారం. అయితే సైలెంట్ గా శ్రియ మరో సినిమాని కంప్లీట్ చేసింది.
సుజనా రావు దర్శకత్వం వహిస్తున్న రియల్ లైఫ్ డ్రామా ‘గమనం’ సినిమాలో శ్రియా శరణ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది. కాగా ఈ సినిమా నుంచి తాజాగా శ్రియా పుట్టినరోజు ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ ‘గమనం’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో శ్రియా చాలా సంప్రదాయబద్ధంగా సాధారణ గృహిణిలా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్ వస్తుంది.
ఇక గమనం సినిమాకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తుండగా ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయిన ఈ సినిమా సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.