Breakfast: పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ గా వాటిని పెట్టుకుంటే, హడావుడి ఉండదు.. సమయానికి పని అయిపోతుంది!!  

Share

Breakfast: బ్రేక్ ఫాస్ట్   మీద    అశ్రద్ధ  ఈ  ఉరుకుల పరుగుల జీవితం లో చాలా మంది బ్రేక్ ఫాస్ట్   మీద   చాలా అశ్రద్ధ  చూపిస్తుంటారు. దీనివల్ల  చాలా హెల్త్ ప్రాబ్లెమ్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని అసలు స్కిప్ చేయవద్దు అని నిపుణులు పదే  పదే  హెచ్చరిస్తూన్నారు.  బ్రేక్ ఫాస్ట్ లో  ఏమి తింటే మనం ఆరోగ్యంగా ఉంటామో కూడా తెలియ చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుందాం. బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్స్  బాగా లభించే  ఫుడ్ ని   తీసుకోవాలని సూచిస్తున్నారు.    ప్రోటీన్ ఉన్న   ఆహారం  తింటే ఎముకలు బలంగా  ఉండటం తో పాటు బరువు కూడా  అదుపులో   ఉంటుంది.    అవి ఎలాంటి ప్రోటీన్స్ అనేది తెలుసుకుందాం.


Breakfast:  అద్భుతమైన ఆరోగ్యం

మొలకల్లో ప్రోటీన్స్  సంవృద్ధి గా    దొరుకుతాయి..  త్వరగా జీర్ణమవుతాయి  కూడా. అందుకే  ఉదయాన్నే  బ్రేక్ ఫాస్ట్ లో    మొలకెత్తిన గింజలు తీసుకోవడం  అన్ని విధాలా మంచిది.  ఇంకా  బాదం , వాల్ నట్స్, జీడి పప్పు లో కూడా ప్రోటీన్    విటమిన్ ఏ, బీ ,ఐరన్, కాల్షియం,  వంటివి బాగా దొరుకుతాయి.    పరగడుపున అల్పాహారంగా వీటిని తీసుకుంటే  అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం.

Breakfast: గుడ్డుని  ని ప్రతి రోజూ

బ్రేక్ ఫాస్ట్ గా  ఓట్స్  తీసుకోవడం వలన  శరీరానికి  ఫైబర్  అందుతుంది.    ప్రతిరోజూ ఉదయాన్నే ఒక కప్పు ఓట్స్  తినడం వలన   ఇది  హై కొలెస్ట్రాల్  ని తగ్గిస్తుంది.  ఆరు గ్రాముల ప్రోటీన్ కూడా శరీరానికి అందుతుంది.
పాల ఉత్పత్తులు అయినా చీజ్,పెరుగు లో ప్రోటీన్స్ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి వీటిని కూడా అల్పాహారంగా తీసుకోవచ్చు.
ప్రోటీన్ కి బెస్ట్ సోర్స్  ఏదైనా ఉంది అంటే అది కోడిగుడ్డు అని చెప్పక తప్పదు.  గుడ్డుని  ని ప్రతి రోజూ తినడం వల్ల మంచి  ఆరోగ్యంగా ఉంటారు. బరువు తగ్గడానికి కూడా  బాగా ఉపయోగపడుతుంది. ఒక మనిషికి   వారు ఉండే  బరువు  అనుసరించి  60 నుంచి 90 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. అది గుడ్డు తో లభిస్తుంది.


Share

Related posts

Social Distance: ఈ సామాజిక దూరం ప్రమాదకరం..!!

bharani jella

YSRCP: పోలీసులకు బెదిరింపుల ఆడియో.. వైసీపీ ఇంచార్జిపై డీజీపీ సీరియస్ నివేదిక..!?

Yandamuri

అమరావతి రైతులకు సిపిఐ మద్దతు

somaraju sharma