NewsOrbit
న్యూస్ హెల్త్

మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారా? అయితే ఈ బెనిఫిట్స్ మీకోసమే!!

మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారా? అయితే ఈ బెనిఫిట్స్ మీకోసమే!!

అసలు ప్రయాణ బీమా అంటే ఏంటీ? దాని వల్ల లాభాలేంటీ? అన్న వివరాలు చాలామందికి తెలియవు. అందుకే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వచ్చే లాభాలేంటో, ప్రయాణ బీమా రిస్క్‌ను ఎలా తగ్గిస్తుందో తెలుసుకుందాం. బేసిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఇందులో మీ వస్తువులు కోల్పోవడం లేదా  అత్యవసర వైద్య సంరక్షణ, లాంటివి కవర్ అవుతాయి.

మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారా? అయితే ఈ బెనిఫిట్స్ మీకోసమే!!

మీ లగేజీ ఎవరైనా దొంగిలించిన, లగేజీ ఎక్కడైనా  పోగొట్టుకున్నా బీమా వర్తిస్తుంది. ఒకవేళ ఫ్లైట్ 12 గంటల కన్నా ఎక్కువ ఆలస్యంగా బయల్దేరితే రీఎంబర్స్ చేసుకోవచ్చు. మీ  ఫ్లైట్ టికెట్ ,హోటల్ రద్దైనా పరిహారం పొందవచ్చు. ట్రిప్‌లో ఉన్నప్పుడు అనారోగ్యం బారినపడ్డా, ప్రమాదంలో చనిపోయినా, గాయాలపాలైనా, ఇన్సూరెన్స్ లభిస్తుంది. డొమెస్టిక్ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వలన ప్రయాణంలో ఏదైనా దుర్ఘటనలు జరిగితే ఆదుకుంటుంది.

మీరు ట్రిప్‌లో ఉండగా ఆస్పత్రిపాలైతే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి  హోటల్ గదికి అయ్యే ఖర్చులను, విమాన ప్రయాణ ఖర్చులు, రీఇంబర్స్ అవుతాయి. భారతదేశం లో ఎక్కడ ఉన్న యాక్సిడెంటల్ మెడికల్ ఎమర్జెన్సీ, అవసరమైన సాయం అందుతుంది. దాంతోపాటు చికిత్స, ప్రయాణం, వైద్యానికి కావాల్సిన మందులకు అయిన ఖర్చుల్ని ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. ఫ్లైట్‌లో ఉన్నప్పుడు, బోర్డింగ్ సమయంలో, అనారోగ్యంపాలైనా, చనిపోయినా పరిహారంవస్తుంది.

విదేశీ ప్రయాణ బీమా విదేశాలకు వెళ్లే వారి కోసం ఇచ్చే పాలసీ. పైన వివరించిన వన్నీ ఇందులోకూడా  వర్తిస్తాయి. దాంతో పాటు డాక్యుమెంట్స్,  పాస్‌పోర్ట్, లగేజీ పోగొట్టుకున్నా బీమా పొందొచ్చు. ప్రమాదంలో అవయవాలు కోల్పోయినా, చనిపోయిన ,అత్యవసరంగా వైద్యానికి తరలించాల్సిన పరిస్థితి వచ్చినా ఈ బీమా అండగా ఉంటుంది. దాంతోపాటు డెబిట్, క్రెడిట్ కార్డు, లపై ఏవైనా మోసపూరిత లావాదేవీలు జరిగితే బీమా వర్తిస్తుంది.

ఏదైనా కారణం చేత విదేశాల్లో డబ్బులు కోల్పోయితే  వెంటనే సాయం లభిస్తుంది. కేవలం పర్యాటకులకు మాత్రమే కాదు… విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ బాగా ఉపయోగ పడుతుంది. అనారోగ్యం పాలైనా, చదువు మధ్యలో ఆపెయ్యాల్సిన పరిస్థితి వచ్చినా, మానసిక, నరాల సంబంధిత వ్యాధులు, డ్రగ్, అల్కహాల్ అడిక్షన్ బారినపడ్డా బీమా వర్తిస్తుంది. అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు,మీకు ఎలాంటి కవర్ కావాలో విశ్లేషించుకొని తీసుకోవడం మంచిపద్దతి.

ఒక ఉదాహరణకు అడ్వెంచరస్ ట్రిప్ వెళ్లాలనుకుంటే, మీరు తీసుకోవాలనుకునే ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో అడ్వెంచరస్ యాక్టివిటీస్‌కు బీమా ఉందో లేదో ముందుగా అడిగితెలుసుకోవాలి. ఏదో ఓక ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసేసుకుని , ఆ తర్వాత ఏదైనా ప్రమాదం జరిగి బీమా వర్తించకపోతే  ఇబ్బంది పడవలిసి  ఉంటుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు అన్ని డాక్యుమెంట్స్ సరిగా చదువుకుని నిర్ణయం తీసుకోవాలి.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?