Architectural:  కొత్త ఇల్లు లేదా స్థలం కొనాలంటే వాస్తు పరమైన ఈ విషయాలు తప్పకుండ చూసుకోవాలి !!

Share

Architectural:  కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్న,  కొనుక్కోవాలనుకున్న  ముందు సరైన పరీక్షలు చేస్తే తర్వాత ఏ  ఇబ్బందులు రావు. ఒక సారి పుట్టిన తేది ఆధారంగా జాతక పరిశీలన   చేయించుకుంటే జాతకం ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే తెలుస్తాయి, వాటికి పరిష్కారాలు  దొరుకుతాయి.చాలామంది చేసే పని ఏమిటంటే  ఇల్లు కట్టుకున్న తర్వాత లేదా  ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత వాస్తు దోషాలున్నాయా అని   వాస్తు పండితుల్ని తీసుకువస్తుంటారు. అది సరైన పని కాదు.      వాస్తు దోషాలు  ఉండడానికి   ప్రదానం గా  3 కారణాలు   ఉంటాయి .మొదటి విషయం ఏమిటంటే  భూమి  కొనుక్కునే   ముందు   అన్ని కోణాల్లో భూమి పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే లూజ్ సాయిల్ అయితే ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉండదు.

కట్టడం  కూడా బలంగా ఉండదు. అలాగే నేల అడుగున  జల నాడులు,దేవాలయాలు, శల్యాలు, దుష్ట శక్తుల ఆవాహన ఉన్న ప్రదేశాలలో ఇల్లు కట్టుకుంటే  సుఖంగా,సంతోషంగా ఉండలేరు. అలాగే చుట్టుపక్కల  పరిస్థితి ఎలా వుంది?ఇరుగూ, పొరుగూ ఎలా ఉన్నారు అనేది కూడా చూసుకోవాల్సిందే.  రెండవది     ఇంటి  యజమాని   నామనికి సంబందించిన  నక్షత్రాన్ని   తీసుకుని ఇంటికి పెట్టె సింహ ద్వారం ఎటువైపు  ఉండాలి..? ఎన్ని గుమ్మాలు  పెట్టుకోవాలి ? అవి ఎక్కడెక్కడ ఉండాలి..? కిటికీలు ఎక్కడ  పెట్టుకోవాలి ?  ఇలాంటి   అన్ని  ముందు వాస్తు పండితులను  అడిగి తెలుసుకోవాలి  .  ఈ జాగ్రత్తలు తీసుకున్నా  కూడా కొన్నిసార్లు  ఇంట్లో  వాస్తు  సరిగా లేదు అని భావిస్తుంటారు . దాని వెనుకున్న కొన్ని  కారణాలు జాతక గోచార గ్రహస్థితి   మన ప్రవర్తన అని చెప్పవచ్చు.

ఇక మూడవది ఏ ఇంట్లో అయితే ఆడవారికి అన్యాయం జరుగుతుందో, ఏ ఇంట్లో అనర్ధాలు  జరుగుతుంటాయో, ఆక్రందనలు ఉంటాయో ఆ ఇంటికి వాస్తు దోషం ఉందని తెలుసుకోవాలి.జీవ హింస జరిగే ఇంట్లో, వృద్ధులు, తల్లిదండ్రులు,  ప్రశాంతం గా లేని  ఇంట్లో  వాస్తు దోషం ఉన్నట్లే. వారు అలా ఉండడం వలన   ఆ ఇంట్లో నివసించే వారికి సుఖశాంతులు  కలుగవు.  పసిపిల్లలకు అన్యాయం జరిగే ఇంట్లో  వాస్తు దోషం ఉన్నట్లే.  ఈ రకమైన  దోషాలు  భూమి  ఎన్నిక చేసుకున్నప్పుడు , ఇల్లు కట్టుకునేటప్పుడు ఏర్పడిన దోషాలు   కాదు. అది కేవలం మన ప్రవర్తన వలన వచ్చే దోషాలు మాత్రమే.కాబట్టి  వాస్తు తో పాటు ప్రవర్తన కూడా  బాగుంటేనే సుఖ సంతోషాలతో  జీవితం గడుస్తుంది అని మరువకండి.


Share

Related posts

న్యూఢిల్లీ :మధ్యవర్తి ప్రయాణాలకు 12 కోట్లు

Siva Prasad

ఆ డైరెక్టర్ తో సినిమా సంతకం పెట్టద్దు ఎన్‌టి‌ఆర్ అన్నా .. ప్లీజ్ ‘ ఫాన్స్ గోల గోల !

GRK

Monasticism: మన హిందూ ధర్మం యవ్వనంలో ఉన్న స్త్రీలు సన్యసించడానికి ఎందుకు అనుమతించదు??

Naina