విడిపోయిన మీ జీవిత భాగస్వామి తో మళ్ళీ కలిసి బ్రతకాలనుకుంటున్నారా??

విడిపోయిన మీ జీవిత భాగస్వామి తో మళ్ళీ కలిసి బ్రతకాలనుకుంటున్నారా??
Share

ఇద్దరు విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి . అలా జీవితభాగస్వామితో విడిపోయి సోలో లైఫే సో బెటర్ అనుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. ఆర్వాత కొన్నిరోజుల గడిచాక మునుపటి జీవితమే సంతోషం గా ఉందని భావించి మాజీభాగస్వామితో కలిసి బ్రతకాలని  కోరుకుంటారు . మాజీ భాగస్వామి తో తిరిగి జీవితాన్ని మొదలుపెట్టాలనుకున్నప్పుడు అస్సలు తొందరపడకూడదు.

విడిపోయిన మీ జీవిత భాగస్వామి తో మళ్ళీ కలిసి బ్రతకాలనుకుంటున్నారా??

ఎన్నో భావోద్వేగాలు, గందరగోళాల మధ్య నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితం మళ్లీ సమస్యల వలయంగా మారుతుంది.కాబట్టి మళ్ళి కలిసి బ్రతకాలని అనిపించినప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోకుండా బాగా  సమయం తీసుకుని ఆలోచించి ముందుకు వెళ్ళాలి.

ఒకవేళ  అలాంటి నిర్ణయం తీసుకోవలిసి వస్తే మాత్రం కొన్ని విషయాల్లో ఖచ్చితమైన అవగాహన ఉండాలి. అవేంటో.. ఇప్పుడు చూద్దాం..
మాజీ జీవిత భాగస్వామి తో రాజీ పడుతున్నామంటే, ఆ ఆలోచన సరైందేనా? కాదా? ఇంతకు ముందు విడిపోవడానికి ఉన్నసమస్యలను  ఇప్పుడు సరిచేసుకోగలరా అని ఒకటికి పది సార్లుఆలోచించుకోవాలి. ఇప్పటి కే ఎన్నో కారణాల చేత విడిపోయినప్పుడు.. అలాంటివన్నీ భవిష్యత్‌లో వచ్చిన సర్దు కు బ్రతకాలని నిర్ణయించుకున్నప్పుడే కలిసి బతకడం గురించి ఆలోచించాలి.

మాజీ భాగస్వామి తో తిరిగి జీవితం మొదలుపెట్టడం మీకు సంతోషాపడుతున్నారో,దాని గురించి బాధపడుతున్నారో మీ మనస్సు ఎలా ఉందొ అలోచించి ముందుకు వెళ్లడం ముఖ్యం. మీరు ఏ కారణం చేత ఇంతకు ముందు విడిపోయారో ఆ విషయంలో మార్పు వచ్చిందా? లేదా? అనేది బాగా గమనించాలి. అవి అలాగే ఉన్న మార్చుకోవచ్చులే అంటూ ధీమాగా మాత్రం ఉండకూడదు..మీ భాగస్వామి తప్పుల విషయం లో స్పష్టత ఉన్నట్లే, మీ విషయంలోనూ జరుగుతున్నా తప్పులేంటో విశ్లేషించుకుని సరిచేసుకోవాలి. ఏ కారణం చేత విడిపోవాల్సి వచ్చిందో, వాటి గురించి మళ్ళి ఇద్దరూ మాట్లాడుకోవడం చాల మంచిది. అలా చేయడం వలన భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.


Share

Related posts

Pragya Jaiswal : వెంకటేశ్ – వరుణ్ తేజ్‌లతో ప్రగ్యా జైస్వాల్ ఐటెం సాంగ్

GRK

Chiranjeevi : చిరంజీవి.. బాలకృష్ణ.. వెంకటేష్.. రవితేజ ..మేలో పెద్ద రచ్చే ..!

GRK

మహేష్ బాబు సర్కారు వారి పాట ఇప్పట్లో లేనట్టే .. దర్శకులకి మంచి ఛాన్స్ ..?

GRK