Weight Loss: అధిక బరువు తగ్గాలంటే  ఈ జావ తాగి చూడండి.. ఒక్క నెలలో మీకు మార్పు కనిపిస్తుంది!!

Share

Weight Loss: బరువు తగ్గి సన్నబడాలి అనుకున్నవారికి  ఉలవలు బెస్ట్ ఆప్షన్ అనే  చెప్పాలి. రోజూ ఉలవలను ఆహారంలో భాగం గా తినడం వలన   శరీరంలో ఉన్న అనవసరపు కొవ్వు తగ్గిపోతుంది.    ఉలవల రసం కూడా  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. శరీర బరువు తగ్గించడంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా  పనిచేయడం లో ఉలవలు బెస్ట్ అనే చెప్పాలి.

శరీరంలో వున్న టాక్సిన్లను బయటకు పంపుతుంది .  ఉలవల లో ఉండే పిండి పదార్థాలు ఆకలిని అదుపు చేస్తాయి. ఉలవలను తింటే  కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల  ఆహారాన్ని మితంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారని వైద్యులు చెబుతున్నారు. ఉలవలను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని తాగడం  ద్వారా జలుబు తగ్గుతుంది.శరీర అవయవాలను బలపరిచే శక్తి ఉలవలలో  వుంది. స్త్రీలలో  నెలసరి సమస్యలు ఇది దూరం చేస్తుంది. ప్రసవానికి అనంతరం ఉలవలను  తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలు బయటకు వచ్చేస్తాయి. ఉలవలు వేయించి పొడి చేసుకుని సీసాలో భద్రపరుచుకోవాలి. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ జీలకర్ర,రెండు స్పూన్ల  ఉలవల పొడిని వేసి మరిగించి ఆ  జావను  పరగడుపున తాగితే ఒకే ఒక్క నెలలో  ఐదు కేజీల వరకు బరువు  తగ్గుతారు.

పరగడుపున మొలకెత్తిన ఉలవలు ఒక  గుప్పెడు తీసుకుంటే.. అజీర్తి సమస్య  తగ్గుతుంది. ఉలవలు లేదా ఉలవల ద్వారా తయారయ్యే పదార్థాలను తీసుకోవడం వలన  మధుమేహం దూరం అవుతుంది. ఉలవల లో పీచు పదార్థాలు రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను పెరిగేలా  చేస్తుంది అని ఆయుర్వేద నిపుణులు తెలియచేస్తున్నారు.


Share

Related posts

కోరి తెచ్చుకున్న కష్టం: రమణ దీక్షితులుకి బిగ్ బ్యాడ్ న్యూస్!

CMR

సినిమా ఆఫర్ గురించి స్పందించిన దేత్తడి హారిక..!!

sekhar

Madhu Priya : వావ్ బంగారం లాంటి వీడియో – తన కొడుకుతో కలిసి పాట పాడిన మధు ప్రియ – లవ్లీ సీన్ డోంట్ మిస్

bharani jella