Physical Activity: మీ పిల్లల కు శారీరక శ్రమ అలవాటు చేయకపోతే భవిషత్తులో జరిగేది ఇదే !!

Tips to Parents for properly care their children Part-2
Share

Physical Activity: కౌమార దశలో
చిన్న వయస్సులో  శారీరక శ్రమ ఉండేలా ఆటలు,వ్యాయామం చేయడం వల్ల పిల్లలు    అన్నివిధాలా  ఆరోగ్యంగా ( Health ) ఉండడానికి బాగా సహాయపడుతుంది.   ప్రదానం గా  బాల్యం తరువాత వచ్చే కౌమార దశలో పిల్లలు వ్యాయామం చేయడం వలన  వృత్తి రీత్యా ఎటువంటి ఒత్తిళ్ల బారిన పడకుండా ఉంటారు. అలా చేసేవాళ్లకు    మధ్య వయస్సులో  గుండె జబ్బులు, ముసలితనంలో అల్జీమర్స్ రాకుండా రక్షణ కలుగుతుంది.వ్యాయామం  మెదడు పెరుగుదలను ప్రేరేపిస్తుంది కూడా.  కాబట్టి తల్లిదండ్రులు ( Parents ) వ్యాయామాన్ని పొట్ట తగ్గటానికి, లావు తగ్గటానికి  మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం అని వారికీ చెప్పి   అలవాటు చేయాలి.  వాళ్లను వ్యాయామానికి పంపే బాధ్యతకానీ ఇంట్లో తల్లితండ్రులు వ్యాయామం చేసే సమయంలో వారిని  కూడా కలుపుకుని  చేసుకుంటే బాగుంటుందని నిపుణులు అంటున్నారు

Physical Activity: గుండె సంబంధిత వ్యాధులు

వ్యాయామం చేయడం వల్ల పిల్లల్లో  జ్ఞాపక శక్తి బాగా  పెరుగుతుంది. దీంతో వారు చదువుతో కుస్తీ  పెట్టవలసిన  అవసరం లేకుండా  చక్కగా బాగా చదువుకుని పరీక్షల్లో  మంచి ప్రతిభ చూపుతారు. అలాగే వారి ఆరోగ్యం కోసం నిత్యంఓకే  సమయానికి పోషకాలతో ఉన్న పౌష్టికాహారాన్ని  ఇవ్వాలి. దీంతో వారు   ఆరోగ్యంగా  ఉంటారు. కొలంబియాకు ( colombia) చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిటీష్  సైంటిస్ట్‌లు కొందరి పిల్లలపై పరిశోధనలు  చేసారు.  ప్రతి రోజు  వ్యాయామం చేసే పిల్లలు, వ్యాయామం చేయని పిల్లలు  వారు చదువుల్లో ఎలా రాణిస్తున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.  ప్రతి రోజు  కనీసం 60 నిమిషాలు    వ్యాయామం చేసే పిల్లలు చదువుల్లో కూడా  ముందు ఉన్నారని తెలుసుకున్నారు. అందువల్ల పిల్లల్ని రోజూ క‌నీసం ఒక గంట పాటు అయినా వ్యాయామం చేసేలా ప్రోత్స‌హించాల‌ని, లేదా కనీసం ఆటలు ఆడేలా  పెద్దలు  చేయాలి అని తెలియచేస్తున్నారు. అధిక  శారీరక శ్రమ  కారణంగా చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు, ఎముకలు త్వరగా ఫ్రాక్చర్ అవ్వడం  లాంటి సమస్యలు   తలెత్తే అవకాశం ఉంది.  కాబట్టి  రోజు మొత్తంలో ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం మరో 30 నిమిషాల పాటు పిల్లలతో వ్యాయామం చేపిస్తేచాలు.

బయట దొరికే ఆహారం

ముఖ్యంగా  పిల్లలకు జంక్ ఫుడ్  అస్సలు అలవాటు చేయకూడదు.  ఇంట్లో తల్లిదండ్రుల ను చూసే పిల్లల ఏదైనా నేర్చుకుంటారు.  కాబట్టి ముందు  పెద్దలలో మార్పు రావాలి. మీరు వాళ్ళ ముందు మంచి ఆహారం తింటూ, వ్యాయామం చేస్తూ ఉండాలి. అది  చూస్తూ పెరిగే  పిల్లలు వారు కూడా అదే చేసేందుకు ఇష్టపడతారు. అప్పుడు మాత్రమే వాళ్ళకి మంచి అలవాట్లు అలవాటు అవుతాయి. పిల్లలకు ఆహారం గా ఎక్కువుగా పాలు  ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణ ధాన్యాలు, పాల పదార్ధాలు వంటివి  ఇస్తూ ఉండాలి.  పిల్లలతో  మరీ కఠినంగా  ప్రవర్తించ కూడదు. దీనికి తోడు పిల్లలకు బయట దొరికే ఆహారం అస్సలు ఇవ్వకూడదు.  కనీసం  హోమ్ వర్క్ చేస్తే కేక్  ఇస్తా  అని కూడా అనకూడదు.  ఇంట్లో మనం పని చేసుకుంటున్నప్పుడు  హెల్ప్ చేయమని అడగాలి.చిన్నప్పటి అలా చేస్తే వాళ్లకు  హెల్పింగ్ నేచర్ అలవాటు  అవడం తో పాటు వారు స్వతహగ కొన్ని పనులు చేసుకోగలుగుతారు.  అంతే తప్ప చిన్న పిల్లలు వాళ్ళు ఏమి చేస్తారు అని వారికీ ఎలాంటి పనులు చెప్పకుండా ఉండకూడదు. పనులు చేయడం వలన భవిషత్తులో వారికీ  మంచి ఫలితం ఉంటుంది.


Share

Related posts

Ys Jagan Mohan Reddy : పక్కాగా ఇది జగన్ బాణమే అంటున్నారు..??

sekhar

Children : మీ పిల్లలు పక్కతడుపుతున్నారా? ఇలా చేసి ఆ సమస్యను తగ్గించండి!!

Kumar

తెలుగుదేశం పోత్తుతో కాంగ్రెస్‌కు నష్టం

Siva Prasad