NewsOrbit
న్యూస్ హెల్త్

ఈ ఒక్క భాషతో పిల్లలు జమ్స్  అయిపోతారు అంటున్న నిపుణులు!!

ఈ ఒక్క భాషతో పిల్లలు జమ్స్  అయిపోతారు అంటున్న నిపుణులు!!

మాతృభాష అంటే అమ్మ మాట్లాడే భాష.. బిడ్డ పుట్టినప్పటినుండి తల్లి బిడ్డలకు నేర్పించే భాషనే మాతృభాష అంటారు. ప్రపంచం లో ఎన్నో భాషలు ఉన్నాయి. ప్రతి మనిషి పుట్టగా నే తల్లి పొత్తిళ్లలోనే మాతృ భాషను నేర్చుకుంటాడు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడడాన్ని ప్రోత్సహిస్తున్నారు.అంతటి తో ఆగకుండా  వారు అనర్గళం గా ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే సంబర  పడిపోతుంటారు.

ఈ ఒక్క భాషతో పిల్లలు జమ్స్  అయిపోతారు అంటున్న నిపుణులు!!

ఇది మంచిదే అయినప్పటి కీ కేవలం ఇంగ్లీష్ మాత్రమే కాదు పిల్లలకు స్థానిక భాష లోనూ పట్టు ఉండడం వారికీ  ఎంతో ప్రయోజనం అని పరిశోధకులు తెలియచేస్తున్నారు. అప్పుడే వారి మేధస్సు మరింత మెరుగుపడుతుందంటున్నారు.అసలు ఆంగ్ల భాషకు ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది.దాన్ని నేర్చు కుంటే ఆర్థికంగా ఎదగవచ్చనే అపోహలో అలా  చేస్తూ ఉంటామని చెప్పవచ్చు. మన దేశం బ్రిటీష్ వారి పాలనలో ఉన్నప్పుడు ఆంగ్ల భాషను నేర్చుకుంటే వారి దగ్గర  ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు అదే దారి లో జీవించేస్తున్నాం.

తెలుగు భాషను నేర్చుకున్న కూడా  ఖచ్చితం గా ఉద్యోగం వస్తుంది అనే  నమ్మకం కల్పించ లేకపోతున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో ఆంగ్ల భాషలో విద్యాభ్యాసం చేసిన వారి జీవితాల్ని చూస్తే ఎన్నో నిజాలు నిజాలు బయట పడతాయి. ఆంగ్ల భాషలో విద్యాభ్యాసం చేసిన 5 శాతం మంది మాత్రమే అమెరికా వంటి విదేశాల కు ఉద్యోగాల కోసం వెళుతున్నారు. 15 శాతం మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే, 50 శాతం మంది అసంఘటిత రంగాల లో కొలువు చేసుకుంటున్నారు . మిగిలిన వారు ఏదో ఒక పని చేసుకుని జీవితం నెట్టుకొస్తున్నారు. ఆంగ్లంలో చదివితే నే ఉద్యోగం వస్తుందనడం ఎంతమాత్రం సమంజసం కాదు అని గుర్తు పెట్టుకోవాలి.

యూకేలో 7-11 సంవత్సరాల  వయసులో ఉన్న 100 మంది టర్కిష్ పిల్లలను నాన్ వెర్బల్ ఐక్యూ టెస్ట్ ద్వారా పరిశీలించి ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడే వారికంటే.. ఇంట్లో స్థానిక భాష, స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలు ఐక్యూలో ముందున్నారని పరిశోధకలు గుర్తించడం  జరిగింది .

వీటికి కారణాలనుపరిశీలిస్తే  ఎవరైనా స్థానిక భాష ని సులభం గా అర్థం చేసుకోగలరు. దానివలన  కొత్త పదాన్ని తెలుసుకుని దాన్ని ఇతర భాష లోకి తర్జుమా చేయడం చాలా తేలిక.   అలా చేసినప్పుడు పిల్లల ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయని అనేక పరిశోధనలలో  బయటపడింది.

ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్‌లో ఎలాగూ ఇంగ్లీష్ తప్పా మిగతా భాషలు మాట్లాడడాన్ని అనుమతించరు. కాబట్టి ఇంట్లోఉన్నప్పుడైనా  పిల్లలు ఖచ్చితంగా స్థానిక భాష మాట్లాడేలా తల్లీదండ్రులు సూచించాలి. కేవలం స్థానిక భాష లోమాట్లాడడమే కాదు..పుస్తకాలను చది వించడం, వారితో కలిసి సంభాషణ లు చేయడం వలన వారికీ  భాష మీద పట్టు ఏర్పడుతుంది.

2016లో కెనడా చేసిన అధ్యయనం లో ఇంగ్లీష్, స్థానిక భాష మాట్లాడే పిల్లల తో పోలిస్తే  కేవలం ఇంగ్లీష్ మాట్లాడే వారి కంటే  కూడా స్థానిక భాష మాట్లాడే పిల్లలు సులభంగా సమస్యలను అధిగమిస్తారని తేలింది. కాబట్టి ఇప్పటికైనా మీ పిల్లలు జనరల్ నాలెడ్జ్‌లో ముందుండాలంటే ఇంట్లో అయినా ఇంగ్లీష్‌ని  పక్కన పెట్టి స్థానిక భాష మాట్లాడేలా ప్రోత్సహించలంటూ తల్లీదండ్రులకు సూచిస్తున్నారు విశ్లేషకులు.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N