ఐఐటీ చరిత్రలో ఓ విద్యార్థి రికార్డు..! కోటిన్నర వేతనంతో ఉద్యోగం..!!

Share

 

 

ఇంజనీరింగ్ అవ్వగానే కొట్టి కొల్లగొట్టాడు. అదేంటి అనుకోకండి…. ఇంజనీరింగ్ విద్య పూర్తవగానే ఉద్యోగం రావడమే గగనం అయిపోయింది. అలాంటి తరుణంలో ఐఐటీ కాన్పూర్‌ విద్యార్థికి మైక్రోసాఫ్ట్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఢిల్లీకి చెందిన ఈ విద్యార్థికి శుక్రవారం నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఏడాదికి రూ.1.5కోట్లను వార్షిక వేతనంగా చెల్లించేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. ఐఐటీ కాన్పూర్‌ చరిత్రలో ఓ విద్యార్థి ఇంత మొత్తంలో వార్షిక వేతనంగా అందుకోవడం ఇదే మొదటిసారి. గత ఏడాది నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో ఓ విద్యార్థి రూ.93లక్షలు వార్షిక వేతనంగా అందుకున్నాడు.

 

MICROSOFT

అయితే, ఈ ఏడాది 200 కంపెనీలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ముందుకొచ్చాయి. వీటిలో ఓలా, ఉబెర్‌, పేటీఎం, అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ సేవలందించే సంస్థలు కూడా ఉన్నాయి. ఈసారి మొత్తం ఎనిమిది మందికి మంచి ఆఫర్లు వచ్చినట్లు ఐఐటీ కాన్పూర్ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 18వ తేదీ వరకు జరిగే క్యాంపస్ ఇంటర్వ్యూలలో 2,100 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. దేశీయ ఐటీ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్లేస్‌మెంట్ ఇస్తున్నాయి.

iit bhubaneshwar

మరోపక్క ఐఐటి భువనేశ్వర్ లో సైతం ఏడుగురు విద్యార్థులు 45 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాదించినట్లు, ఆ కళాశాల డైరెక్టర్ తెలిపారు. ఐఐటి భువనేశ్వర్ డైరెక్టర్ ఆర్.వి.రాజా కుమార్ మాట్లాడుతూ, “ఈ సంవత్సరం తమ క్యాంపస్ రిక్రూట్మెంట్ లో పెరుగుదల కనబరిచింది,చివరి సంవత్సరం ముగ్గురు విద్యార్థులు 43 లక్షలతో ఉద్యోగం సాధించగా, ఇప్పుడు “ఎలక్ట్రికల్ సైన్స్ విభాగానికి కి చెందిన ఏడుగురు విద్యార్థులు 45 లక్షల వార్షిక ప్యాకేజీ ను అందుకున్నారు, ఇది కళాశాలలో ఇప్పటివరకు సాధించిన ఉద్యోగాలలో గొప్పది అని అయినా తెలిపారు.

ఐఐటి భువనేశ్వర్ కెరీర్ డెవలప్మెంట్ సెల్ ప్రొఫెసర్ ఎకె ప్రధాన్ మాట్లాడుతూ, మార్కెట్లో మహమ్మారి ప్రభావం ఉన్నప్పటికీ విద్యార్థుల ఎంపిక విషయంలో కంపెనీలు ఆసక్తి కనబరిచాయి అని చెప్పారు. కోవిడ్ -19 పరిమితుల కారణంగా ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఐఐటి భువనేశ్వర్‌లో ప్లేస్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది అని తెలిపారు. చివరి సంవత్సరం విద్యార్థులందరూ వర్చువల్ మోడ్‌ ద్వారా ఇంటర్వ్యూ లో పాల్గొంటున్నారు అని అయినా చెప్పారు.


Share

Related posts

YSRCP : వైసీపీ టార్గెట్ పై నేతలు మల్లగుల్లాలు -! నిమ్మగడ్డా ఎంత పని చేస్తివి..!!

somaraju sharma

చిరంజీవి గోవింద ఆచార్య ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Vihari

ఎస్ పి బాలుకు భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి లేఖ రాసిన ఏపి సీఎం వైఎస్ జగన్

Special Bureau