Ileana D’Cruz : పూరీ జగన్నాథ్ నటీమణి చిట్టి నడుము సుందరి ఇలియానా గురించి ప్రేత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇలియానా వ్యక్తిగత విషయాలలో చాలా ప్రైవేటుగా ఉండటం మన అందరికి తెలిసిన విషయమే. కానీ ఇన్స్టాగ్రామ్ పుణ్యమాని ఇలియానా చాలా కొత్త విషయాల గురించి తన అభిమానుల తో మాట్లాడుతూ వెల్లడించింది.

ఇంతందం దారి మళ్ళిందా
భూమిపైకే చేరుకున్నదా
లేకుంటే చెక్కి ఉంటారా
అచ్చు నీలా శిల్ప సంపదా…
ఈ పాట మృణాల్ ఠాకూర్ కి సెట్ అయిందో లేదో కానీ జక్కన్న చెక్కిన శిల్పం లాంటి ఇలియానా కు మాత్రం చాలా బాగా వర్తిస్తుంది. ఇలియానా ఒంపుల అందం అంలాంటిది మరి.

ఇటీవల ఇన్స్టాగ్రామ్ ప్రెవేశపెట్టిన ‘Ask Me Anything’ ‘నన్ను ఏదైనా అడగండి’ అనే ఫీచర్ ని ఇలియానా ట్రై చేసింది. అందులో భాగంగా తన అభిమానులు అడిగిన చాలా ప్రెశ్నలకు ఇలియానా సమాధానం ఇచ్చింది.

మీ లైఫ్ పార్టనర్ ఎవరు అని అడిగిన ఒక అభిమాని ప్రెశ్నకు సమాధానంగా ఇలియానా ఆండ్రూ నీబోన్ ని ట్యాగ్ చేస్తూ ‘పిచ్చి గా ప్రేమలో’ అని కామెంట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది.

ఇలియానా భర్త ఆండ్రూ నీబోన్ అని ఇంతకముందు పుకార్లు ఉన్న విషయం తెలిసిందే. ఇంతకముందు ఒక ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో ఫోటో క్రెడిట్ మై హబ్బీ అని ఆండ్రూ నీబోన్ పేరు జతపరచడం ఈ పుకార్లకు కారణం.

అయితే ఇంతవరకు ఎలాంటి ఇలియానా పెళ్లి ఫోటోలు కానీ వీడియోలు కానీ విడుదల చేయలేదు. చెప్పి చెప్పనట్టు తన భర్త ఎవరు అన్న విషయంలో ఇలియానా చాలా స్మార్ట్ గ వ్యవహరిస్తుంది. ఇలియానా ఇంకా ఆండ్రూ నీబోన్ ప్రేమలో ఉన్న విషయంలో సందేహమే లేదు. ఇలియానా కష్టకాలంలో ఆండ్రూ నీబోన్ తనకు చాలా సపోర్ట్ చేసాడు. ఇలియానా కు పెళ్లి అయిందో లేదో కానీ అన్ని రకాలుగా ఆండ్రూ నీబోన్ తన భర్త అని మాత్రం చెప్పేసింది.

ఇలియానా గురించి ఇతర కథలు: ఇలియానాను ఇలా చూసి ఎన్నేళ్లు అయింది.. వైరల్‌గా మారిన లేటెస్ట్ పిక్స్!