Ileana : దేవదాసు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన భామ ఇలియానా.. ఈ సైజ్ జీరో భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది.. అభిమానులతో ఆస్క్ మీ ఎనీథింగ్ చిట్ చాట్ సెషన్ లో నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు.. నచ్చినవాడు ఎవరు.. అనే రెండు ప్రశ్నలు ఎదురయ్యాయి..
వాటికి ఇల్లీ వెంటనే ఆన్సర్ కూడా ఇచ్చేసింది. అతని పేరు చార్లీ. నా కొత్త ఫ్రెండ్ అంటూ పరిచయం చేసింది. ఇంతకీ చార్లీ ఎవరు అంటే.. తన పెట్ డాగ్. ఆ క్యూట్ పప్పి ఫోటోలు షేర్ చేసింది గోవా బ్యూటీ.. ఈ ఫన్ ఎలిమెంట్ అభిమానులకు పిచ్చగా నచ్చేసింది.
అలాగే మీరు అందం కోసం సర్జరీ చేయించుకున్నారా.. అన్న ప్రశ్న కూడా అలాంటిదేమీ లేదని సింపుల్ గా ఆన్సర్ చేసింది.ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ కం ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో బ్రేకప్ అయ్యాక ఇలియానా డిప్రెషన్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం హిందీలో బిగ్ బుల్ అనే చిత్రం లో నటిస్తుంది. తన స్నేహితుడు అజయ్ దేవగన్ ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా లో అభిషేక్ బచ్చన్ కథానాయకుడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?