NewsOrbit
జాతీయం న్యూస్

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

Rain Alert: రానున్న అయిదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటక లో భారీ వర్షాలు కురస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. మే 21వ తేదీ వరకూ కేరళలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురస్తాయని ఐఎండీ శుక్రవారం రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా రాగల నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Rain alert

దక్షిణ తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ధ్రోణి, రాయలసీమ, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు మీదుగా దిగువ, మధ్య ట్రోపోస్పెరిక్ స్థాయిలో ఉపరితల ఆవర్థనం ఏర్పడిందని ఐఎండీ శుక్రవారం వెల్లడించింది. దక్షిణ చత్తీస్ గఢ్ నుండి కొమోరిన్ ప్రాంతం వరకూ అల్పపీడన ధ్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్ఛేరి, కరైకల్, కేరళ, మాహే, లక్షద్వీప్, దక్షిణ కర్ణాటక లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని, 40 – 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో మరో నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో పాటు గంటలకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 17 నుండి 21వరకూ తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహే లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో మే 20,21 తేదీల్లో దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక లో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మే 20, 21 తేదీల్లో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న అయిదు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు.

Lok Sabha Elections 2024: దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..? : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N