immanuel and rashmi comedy in kevvu karthik performance in extra jabardasth
రష్మీ.. ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ మాత్రమే కాదు.. తనకు బుల్లితెర మీద చాలా ఫాలోయింగ్ ఉంది. రష్మీ కోసమే ఎక్స్ ట్రా జబర్దస్త్ చూసేవాళ్లు బోలెడు. ఇక.. సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అసవరం లేదు. ఆన్ స్క్రీన్ మీద వాళ్ల కెమెస్ట్రీ ఎలా పండుతుందో అందరికీ తెలుసు.
ఇక అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ విడుదలయింది. అందులో కెవ్వు కార్తీక్ స్కిట్ లో రష్మీ చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ముక్కున వేలేసుకుంటున్నారు. ఒక యాంకర్ అయి ఉండి.. దేన్నయినా స్పోర్టివ్ గా తీసుకోవాలని కానీ.. ఇలా పిచ్చిపనులు చేయడం ఏంటి.. అంటూ మండిపడుతున్నారు.
ఇంతకీ ఏమైందంటే.. కెవ్వు కార్తీక్ స్కిట్ లో భాగంగా… ఇమ్మాన్యుయేల్ గుడ్డివాడిగా నటించాడు. వర్షను పడేయడానికి వర్ష ఉండే ఆఫీసుకు గుడ్డివాడిగా వెళ్తూ.. సరదాగా రష్మీ కూర్చున్న కుర్చీ దగ్గరికి వెళ్లి రష్మీని ముట్టుకోబోతాడు. దీంతో.. వెంటనే దడుసుకున్న రష్మీ.. తన కాలుకు ఉన్న చెప్పును తీసి మరీ ఇమ్మాన్యుయేల్ కు చూపిస్తుంది. దీంతో ఇమ్ముతో పాటు సెట్ లో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
రష్మీ ఏంటి.. ఇలా చేసింది అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఇమ్మాన్యుయేల్ కూడా మనకెందుకు గొడవ అని అక్కడి నుంచి వెళ్లి తన స్కిట్ తాను చేసేశాడు. దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి మరి..
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…