Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష Jabardasth Varsha గురించి తెలుసు కదా. జబర్దస్త్ లో అడుగు పెట్టింది.. ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం తను ఒక సెలబ్రిటీ. తను లేకుంటే ఎక్స్ ట్రా జబర్దస్తే లేదు.. ఇమ్మాన్యుయేల్ కూడా లేడు. ఇమ్ము, వర్ష.. ఇద్దరి కాంబినేషన్ అదిరిపోతుంది. ఆన్ స్క్రీన్ మీద వాళ్లిద్దరి కెమిస్ట్రీ అదుర్స్. అందుకే.. ఇద్దరికి ప్రస్తుతం ఉన్న క్రేజ్ అటువంటిది.

ఇప్పటికే.. ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ మీద ఇమ్మాన్యుయేల్ మీద తనకున్న ప్రేమ గురించి ఎన్నోసార్లు బయటపెట్టింది వర్ష. తాజాగా మరోసారి ఇమ్ము మీద ఉన్న ప్రేమను స్టేజ్ మీద చెప్పింది.
నాకు ఏదైనా అయింది అని తెలిస్తే చాలు.. ఆగడు.. వెంటనే ఫోన్ చేస్తాడు. యూట్యూబ్ లో జబర్దస్త్ వర్ష సూసైడ్ చేసుకుంది అని ఎవరో వీడియోలు పెడితే.. ఆ వీడియో చూసి వెంటనే కాల్ చేశాడు ఇమ్మాన్యుయేల్. అది ఇమ్మూకు నామీద ఉన్న ప్రేమ. ఆ సమయంలో ఇమ్మాన్యుయేల్ నావాడు.. అని అనిపించింది.. అంటూ వర్ష తన మనసులో మాటను మరోసారి బయటపెట్టింది.
Jabardasth Varsha : నో డౌట్.. వీళ్లిద్దరి మధ్య ఉన్నది ప్రేమే?
ఇక.. వర్ష అలా అనేసరికి.. వర్ష, ఇమ్మాన్యుయేల్ ఇద్దరి మధ్య ఉన్నది లవ్ అని.. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సుడిగాలి సుధీర్, రష్మీ ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టినా.. వర్ష, ఇమ్మాన్యుయేల్ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారంటూ జోస్యం చెబుతున్నారు. ఏమో చూద్దాం మరి.. అది ఎంత వరకు నిజం అవుతుందో? ప్రస్తుతానికి తాజాగా విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోను చూసేయండి.