Immanuel : ఇమ్మాన్యుయేల్ Immanuel తెలుసు కదా. అదేనండి.. జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్. జబర్దస్త్ లోకి వచ్చి సంవత్సరం కూడా కాలేదు. జబర్దస్త్ లోకి వచ్చిన కొన్ని నెలల్లోనే జబర్దస్త్ లో క్రేజీ కంటెస్టెంట్ అయిపోయాడు. అలాగే.. వర్ష, ఇమ్మాన్యుయేల్ ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వడం.. ఇద్దరూ తెగ ఫేమస్ అయిపోవడం.. ఆ జంట ఆన్ స్క్రీన్ మీద బాగా వర్కవుట్ అవ్వడంతో.. ఇద్దరికీ ఓ రేంజ్ లో పాపులారిటీ వచ్చేసింది.

ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మీ అంటే ఎంతో క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఇమ్మాన్యుయేల్, వర్ష అంటున్నారు అంతా. అది వాళ్ల రేంజ్. ఇద్దరూ కలిసి ప్రతి స్కిట్ లో చేసే రొమాన్స్ మామూలుగా ఉండదు. అసలు మీ మధ్య ఏముంది.. అని జడ్జి రోజా కూడా ఒకసారి అడిగారు. ఏముంటుంది మేడం. వర్ష నాకు బెస్ట్ ఫ్రెండ్. నాకు దేవుడిచ్చిన గిఫ్ట్ అంటూ ఇమ్మూ ఏదో మేనేజ్ చేయబోయాడు కానీ.. ఇద్దరి మధ్య ఏదో ఉందని తాజాగా తెలిసిపోయింది.
Immanuel : వాలంటైన్స్ డే సందర్భంగా రోజా పువ్వు ఇచ్చి వర్షకు ఇమ్మాన్యుయేల్ ప్రపోజ్
అసలే వాలంటైన్స్ డే దగ్గరికి వచ్చింది. ఇక జబర్దస్త్ లో ఉన్న ప్రేమ జంట ఊరుకుంటుందా? ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ లో వర్షను స్టేజ్ మీదికి పిలిచి మరీ.. సపరేట్ హార్ట్ షేప్ బెలూన్ ఇచ్చి.. రోజా ఫ్లవర్ ఇచ్చి మరీ వర్షను పడేశాడు ఇమ్మాన్యుయేల్.
చిన్నప్పటి నుంచి నా కలర్ చూసి ఒక్క అమ్మాయి కూడా నా పక్కన కూడా నిలబడటానికి ఇష్టపడలేదు. కానీ.. నా కలర్ ను ఇష్టపడి.. నా పక్కన నిలబడింది ఒక్క వర్ష మాత్రమే. అందుకే.. ఈ వాలంటైన్స్ డే రోజున చెబుతున్నా.. వర్ష ఎప్పుడూ నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నా.. అంటూ పెద్ద ఉపన్యాసమే ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్. లాస్ట్ కు వర్ష.. నిన్ను కలిశాక.. నా లైఫ్ లో చాలా మార్పులు వచ్చాయి.. హార్ట్ ఫుల్ గా చెబుతున్నా నీకు హ్యాపీ వాలంటైన్స్ డే.. అంటూ ఇమ్మాన్యుయేల్ వర్షకు శుభాకాంక్షలు చెప్పేసరికి.. స్టేజ్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది.