ఇమ్మాన్యుయేల్.. ఒక రెండు మూడు నెలల ముందు అసలు ఈయన ఎవ్వరో కూడా తెలియదు. కానీ.. జబర్దస్త్ లోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో ఇక చూసుకోండి మనోడి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇంకా పెరుగుతూనే ఉంది. ఇమ్మాన్యుయేల్ జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండు కామెడీ షోలలో కనిపిస్తున్నాడు. ఆయన వేసే పంచులు, చెప్పే డైలాగ్ లు ఎంతో నవ్వు తెప్పిస్తాయి. అందుకే ఇమ్మాన్యుయేల్ కు జబర్దస్త్ లో అంత పాపులారిటీ.

అలాగే.. ఇమ్మాన్యుయేల్ తో కలిసి చాలా స్కిట్ లలో నటించిన వర్ష కూడా ప్రస్తుతం తెగ ఫేమస్ అయిపోతోంది. వీళ్లిద్దరి జంట చూడ ముచ్చటగా ఉండటం.. ఇద్దరూ కలిసి ఎక్కువగా స్కిట్లు చేస్తుండటంతో.. ఈ జంటకు కూడా బుల్లితెరపై తెగ క్రేజ్ వచ్చేసింది.
అందుకే ఏ ప్రోగ్రామ్ లో చూసినా ఇద్దరే కనిపిస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఇద్దరూ లవ్ సాంగ్స్ వేసుకొని డ్యాన్స్ చేస్తూ అదరగొట్టేస్తున్నారు.
మామూలుగా ఇమ్మాన్యుయేల్ కేవలం కామెడీ మాత్రం చేస్తాడని మనం అనుకున్నాం కానీ.. ఆయనలో మనకు తెలియని మరో టాలెంట్ కూడా ఉంది. అదే లేడీ గొంతుతో పాటలు పాడటం. అవును.. తాజాగా ఇమ్మాన్యుయేల్, వర్ష.. ఇద్దరు కలిసి క్యాష్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ లో కూడా తెగ సందడి చేశారు అది వేరే విషయం అనుకోండి. అయితే.. ప్రోగ్రామ్ లో భాగంగా.. ఇమ్మాన్యుయేల్ లేడీ గొంతుతో పాట పాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. వామ్మో.. ఇమ్మూలో ఇంత టాలెంట్ ఉందా? అందుకే కదా.. ఇమ్మూకు అంత పాపులారిటీ.. అంత డిమాండ్. నో డౌట్ .. మనోడు ఇండస్ట్రీలో ఎక్కడికో వెళ్లిపోతాడు.. అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. మీరు కూడా ఇమ్మూ టాలెంట్ ను చూసేయండి.