ట్రెండింగ్ న్యూస్

Immanuel : వర్షను వదిలేసి మరో అమ్మాయి వెనుక తిరుగుతున్న ఇమ్మాన్యుయేల్ కు భలే బుద్ధి చెప్పారు?

immanuel with another girl in ugadi jathi ratnalu event
Share

Immanuel : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తెలుసు కదా. ఆయన ప్రస్తుతం జబర్దస్త్ లో టాప్ కామెడియన్. ఒక్క జబర్దస్త్ లోనే కాదు.. మరే షో అయినా సరే… అందులో ఇమ్మాన్యుయేల్ ఉండాల్సిందే. ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్ కు ఉన్న డిమాండ్ అటువంటిది. ఇమ్మాన్యుయేల్ తో పాటు వర్ష కూడా అంతే ఫేమస్ అయింది. ఇమ్మాన్యుయేల్, వర్ష జంట ఫుల్ టు ఫేమస్ అయ్యారు. ఆన్ స్క్రీన్ మీద వాళ్ల కెమిస్ట్రీ మామూలుగా ఉండదు. అది వాళ్లకు ఉన్న పాపులారిటీ.

immanuel with another girl in ugadi jathi ratnalu event
immanuel with another girl in ugadi jathi ratnalu event

ఇమ్మాన్యుయేల్ అంటే వర్ష… వర్ష అంటే ఇమ్మాన్యుయేల్… ఇద్దరి మధ్య ఉన్నది కేవలం కంటెస్టెంట్ల బంధం, జబర్దస్త్ బంధమే కాదు… ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఉంది. ఆ విషయం చాలాసార్లు జబర్దస్త్ స్టేజ్ మీద వర్ష…చెప్పింది కూడా. త్వరలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వస్తున్నాయి.

Immanuel : ఉగాది జాతిరత్నాలు షోలో వర్షను వదిలేసి శ్రావ్స్ ను పట్టుకున్న ఇమ్మాన్యుయేల్

ఈ ఉగాది పండుగ సందర్భంగా ఈటీవీలో ఉగాది జాతిరత్నాలు అనే కామెడీ ప్రోగ్రామ్ ను ప్రసారం చేయనున్నారు. ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ షోలో జబర్దస్త్ కంటెస్టెంట్లతో పాటు జడ్జిలుగా పూర్ణ, సంగీత, మనో వ్యవహరించారు. మరో జడ్జిగా ఉదయభాను వచ్చారు. గెస్టులుగా టక్ జగదీష్ నాని, ఆ సినిమా హీరోయిన్ కూడా వచ్చారు. మరో గెస్ట్ గా సింగర్ మంగ్లీ కూడా వచ్చి పాటలు పాడి సందడి చేసింది.

ఈసందర్భంగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ వర్షను వదిలేసి శ్రావ్స్ అనే అమ్మాయితో రొమాన్స్ చేశాడు. వీళ్ల రొమాన్స్ ను చూసిన వాళ్లంతా ఇమ్మాన్యుయేల్ ను ఆపే ప్రయత్నం చేసినా… అస్సలు వినలేదు. మొత్తానికి ఇమ్మాన్యుయేల్ మాత్రం వర్ష ఆ షోకు రాలేదని… వేరు అమ్మాయితో రాసుకుపూసుకు తిరిగాడు. మరి.. తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే… ఉగాది జాతిరత్నాలు ఎపిసోడ్ మొత్తం చూడాల్సిందే. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమోను చూసేయండి.


Share

Related posts

జగన్ వరకు అక్కర్లేదు చంద్రబాబే ఆ టిడిపి ఫ్యామిలీ పొలిటికల్ చాప్టర్ క్లోజ్ చేశారు..??

sekhar

బిగ్ బాస్ 4 : ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఇదిగో….?

arun kanna

Rakul Preet Singh Latest pics

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar