మనిషి జీవితం ఆరోగ్యం గా, పుష్టిగా సంపూర్ణ ణం గా ఉండాలంటే, ప్రతిరోజూ మన ఆహారం లో ఆవు నెయ్యిని తప్పనిసరిగాచేర్చుకోవాలి. డబ్బు లేకపోతే అప్పు చేసైనా ఆవు నెయ్యిని కొని ప్రతిరోజూ ఆహారంలో వాడాలని పెద్దలు హాస్యమాడుతుంటారు. దాని అర్ధం డబ్బును సంపాదించుకోవచ్చుకానీ ఆరోగ్యం పాడైతే తిరిగి తెచ్చుకోవడం కష్టమని పెద్దలు హెచ్చరిస్తూ ఆ విధం గా చెబుతుంటారు.
ఆవు నెయ్యి లైట్ యెల్లోకలర్ లో ఉంటుంది. అందులో కెరోటిన్ విటమిన్ ఎ కు ఇంకో రూపం. ఈ పదార్థం వలనే ఆవు పాలల్లో ను నేతిలో విటమిన్ ఎ పుష్కలం గా దొరుకుతుంది. మిగిలిన నేతుల్లో విటమిన్ ఎ లేకపోవడం వలన వాటికి పసుపు రంగు ఉండదు. ఈ కారణం వలన ఆవు నెయ్యి చాలా చాలా మంచిదంటారు. ఆవు నెయ్యి ఆహారం లో తీసుకోగానేచాల త్వరగా శరీరంలోని అణువణువులోకి చేరిపోయి, శక్తిని వచ్చేలా చేస్తుంది. వెన్నె వేడి చేసి నెయ్య చేయడంతోనే కొంత విటమిన్ నష్టం జరుగుతుంది.
మళ్ళీ, మళ్ళీ వేడి చేయడం వల్ల విటమిన్ ఎ పూర్తిగా నష్టపోతాం. కాబట్టి వేడి చేసేటప్పుడు పాత్ర మీద ఏదైనా గట్టి మూత పెట్టడంవలన విటమిన్ ఎ ను కాపాడవచ్చట. క్రమం తప్పకుండా రోజూ ఆవు నేతిని తీసుకోవడం వల్ల ఎముకల పటుత్వం, ఎముకల్లో ఉన్న మూలుగు రూపాంతరం చెందుతుందని, మాటలను స్పష్టంగా పలికేలా చేస్తుందని ఆయుర్వేదం తెలియచేస్తుంది.ఇంకా చెప్పాలంటే ఆరోగ్యానికి పునాది లాంటిది ఆవు నెయ్యి.
మానసిక ఆందోళనలను, ఉద్రేకాలను, బలహీనతలను సమర్థవంతం గా అరికట్టి, మనస్సుకు ప్రశాంతత్వాన్ని కలిగిస్తుంది. అన్ని సమస్యలకు కారణమైన రజోగుణాన్ని, తమో గుణాన్ని తగ్గించి సాత్విక గుణాన్ని పెంచి.. మానవుణ్ణి మేధావి గా చురుకుగా, కాంతివంతుడుగా చేసే శక్తి ఆవు నెయ్యి లో పుష్కలం గా ఉందట .ఏ వ్యాధి బారిన పడకుండా , శక్తి సన్నగిల్లకుండా ఆవు నెయ్యి కాపాడుతుందట.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…