NewsOrbit
జాతీయం న్యూస్

Constitution Day: భారత రాజ్యాంగ దినోత్సవ ప్రత్యేకత ఏమిటంటే.!?

Importance of Indian Constitution Day

Constitution Day: సుమారు 200 ఏళ్లు బ్రిటిషర్ల పాలనలో దోపిడీకి గురై అస్తవ్యస్తమైన భారతావనిని స్వాతంత్రం అనంతరం ఏకతాటిపైకి నడిపించడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషించింది. రాజ్యాంగం అంటే.. దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక వంటిది. ఆ దీపస్తంభపు వెలుగుల్లో సర్వసత్తాక సార్వభౌమాధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి.. అందుకని రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానం ఉంది.. కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేక దేశాలు రాజ్యాంగాలను రచించాయి.. కానీ భారత రాజ్యాంగ రచన ఓ సంక్లిష్టం..

Importance of Indian Constitution Day
Importance of Indian Constitution Day

భారతదేశ ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. దీన్నే సంవిధాన్ దివాస్ అని కూడా అంటారు. ఇదే రోజులు జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. 1947లో స్వాతంత్రం లభించిన రెండేళ్ల తర్వాత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించి స్వీకరించారు.. ఆ తరువాత 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకని రాజ్యాంగం పుట్టిన నవంబర్‌ 26ని గుర్తు పెట్టుకోవాలని 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఎల్‌.ఎమ్‌. సింఘ్వీ అనుకున్నారు. దాంతో నవంబరు 26న న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది. 2015లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ 125వ జయంతి సందర్భంగా నవంబర్‌ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించింది.

భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ బాబా సాహెబ్ అంబేద్కర్ సారధిగా డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విభిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలో కొత్తదైన రాజ్యాంగం రూపదిద్దుకుంది. అందుకనే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారత రాజ్యాంగం ఉన్నత విలువలు కలిగి ఉందంటూ మన్ననలు పొందింది. నవంబర్‌ 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నాం. భారత రాజ్యాంగానికి 66 యేళ్లు.

భారత రాజ్యాంగ పితగా పిలుచుకునే డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 125వ జయంతి జరిగింది. ఆయన 1891 ఏప్రిల్ 14న జన్మించగా.. 1956 డిసెంబర్ 6న కన్నుమూశారు. 125వ జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరపాలని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేక కమిటీని వేసింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆ కమిటీ.. ఏడాది పాటూ ఉత్సవాలు నిర్వహించింది. అంబేద్కర్ ఆశయాల సాధనలో భాగంగా.. రకరకాల కార్యక్రమాల్ని నిర్వహించారు. ఆ క్రమంలో.. 2015 అక్టోబర్‌లో.. ముంబైలోని.. అంబేద్కర్ జ్ఞాపిక దగ్గర.. పునాది రాయి వేస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. రాజ్యాంగ దినోత్సవ ప్రకటన చేశారు. అలా 2015 నుంచి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం.

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సుప్రీంకోర్టులో జరిగే వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోడీ ఈ-కోర్టు ప్రాజెక్ట్ కింద వివిధ కార్యక్రమాలను సైతం ప్రారంభించారు. 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన జ్ఞాపకార్థంగా.. 2015 నుంచి నవంబర్ 26న ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. బీఆర్ అంబేడ్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వం 2015లో.. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అంతకుముందు ఈ రోజును లా డేగా పాటించేవారు. నేటికీ అనుసరిస్తున్నారు కూడా.

author avatar
bharani jella

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N