గ్రేట‌ర్ ఓటింగ్‌…మీకు మాస్క్ లేక‌పోతే ఏం జ‌రుగుతుందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా కూడా ఆస‌క్తిని రేకెత్తిస్తున్న గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల పోలింగ్ కొన‌సాగుతోంది. ఉద‌యం 7 గంటల నుంచి ప్రారంభ‌మైన పోలింగ్ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు జ‌రగ‌నుంది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 150 వార్డుల్లో 74.44 ల‌క్ష‌ల ఓట‌ర్లు ఉండ‌గా..1,122 మంది అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు.

bandi sanjay master plan to face cm kcr in ghmc elections

 

టీఆర్‌ఎస్‌ నుంచి 150 మంది, బీజేపీ నుంచి 149, కాంగ్రెస్‌ నుంచి 146, టీడీపీ నుంచి 106, ఎంఐఎం నుంచి 51, సీపీఐ నుంచి 17, సీపీఎం నుంచి 12 మంది వీరితో పాటు 415 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. న్నిక బరిలో ఉన్న 1122 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. ఇందులో అత్యధికంగా జంగంమెట్‌ డివిజన్‌లో 20 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉప్పల్‌, బార్కస్‌, జీడిమెట్ల, నవాబ్‌సాహెబ్‌కుంట, టోలీచౌకి డివిజన్లలో అత్యల్పంగా ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఇది పోలింగ్ లెక్క‌

టీఎస్‌ఈసీ వెబ్‌సైట్‌లో ఓటరు స్లిపులు డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు పోలింగ్‌ కేంద్రం లొకేషన్‌ను సైతం తెలుసుకోవచ్చు. మొబైల్‌యాప్‌లో, మైజీహెచ్‌ఎంసీ యాప్‌లో పోలింగ్‌ స్టేషన్‌ లొకేషన్‌ను తెలుసుకునే వెసులుబాటు ఉంది. 2,272 కేంద్రాలను లైవ్‌ వెబ్‌ క్యాస్టింగ్‌తో పర్యవేక్షిస్తారు. గ్రేట‌ర్‌లోని సున్నిత‌, స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల‌పై పోలీసులు ప‌టిష్ఠ‌బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. పాత బ‌స్తీ ప‌రిధిలోనే ఎక్కువ‌గా స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాల‌ను గుర్తించారు. ఎన్నిక‌ల్లో శాంతి భ‌ద్ర‌త‌ల నిర్వ‌హ‌ణ కోసం 52,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్నారు.

మాస్కు లేక‌పోతే అంతే సంగ‌తి

పోలింగ్‌ కేంద్రాల వద్ద కరోనా మార్గదర్శకాలు పాటించాలని ఎస్‌ఈసీ ఆదేశాలు జారీచేసింది. ప్రతి ఒక్కరు విధిగా మాస్కు ధరించాలని ఎస్‌ఈసీ సూచించింది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించింది. కరోనా బాధితులకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగదించేకునే అవకాశం కల్పించింది. దీంతో మొత్తం 2831 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. కరోనా బాధితులు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఓటేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు.

SHARE