NewOrbit
న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

Breaking: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు.. కాలికి బుల్లెట్ గాయం

Share

Breaking: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లో గురువారం ర్యాలీ నిర్వహిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయమైంది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇమ్రాన్ పై కాల్పులు జరిపిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నిందితులు ఎవరు అనేది ఇంకా వెల్లడించలేదు. ఇమ్రాన్ కాన్వాయ్ రాజదాని ఇస్లామాబాద్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల ఘటనలో ఇమ్రాన్ ముఖ్య అనుచరుడు, ఎంపీ ఫైజల్ జావెద్ కూడా గాయపడినట్లు సమాచారం.

Imran Khan

 

చాలా కాలంగా తన ప్రాణాలకు ముప్పు ఉందని ఇమ్రాన్ ఖాన్ పలు వేదికలపై వెల్లడిస్తూనే ఉన్నారు. ఇదే సందర్భంలో అధికార పక్షంపైనా, పాక్ నిఘా విభాగం ఐఎస్ఐ పైనా తీవ్ర స్థాయిలో ఆయన విమర్శిస్తున్నారు. ఐఎస్ఐ రహస్యాలు తన గుప్పిట్లో ఉన్నాయంటూ కూడా హెచ్చరికలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయనపై కాల్పులు జరగడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisements
Imran Khan

Share

Related posts

వార్నీ… సుధీర్ ను ఈ అమ్మాయి ఎలా ఆడుకుందో చూడండి?

Varun G

Car lovers: కారు కొనాలనుకుంటున్నారా.. అఫర్ లో సుమారు లక్ష రూపాయిల వరకు తగ్గింపు వుంది, చూడండి!

Ram

శాంసంగ్ నుంచి గెలాక్సీ ఎం31ఎస్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచ‌ర్లు బాగున్నాయ్‌..!

Srikanth A