యంగ్ హీరోల కంటే దూకుడుగా నాగ్ .. 2021 లో 3 సినిమాలు రిలీజ్ అంటున్నారు… ?

2020 లో కరోనా కారణంగా మన టాలీవుడ్ హీరోలకి ఊహించని విధంగా షాక్ తగిలింది. ఒక్కొక్కరు వరసగా సినిమాలతో వద్దామనుకుంటే కరోనా లాక్ డౌన్ గట్టి దెబ్బ కొట్టింది. దాదాపు 7-8 నెలలు హీరోలందరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఆ కారణంగా 2020 లో ప్లాన్ చేసుకున్న సినిమాలన్నీ పెండింగ్ లో పడ్డాయి. గత నెల నుంచి మళ్లీ సినిమాలన్నీ సెట్స్ మీదకి వచ్చి షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.

First Look of Wild Dog: Nagarjuna as NIA officer - tollywood

కాగా టాలీవుడ్ కింగ్ మన్మధుడు నాగార్జున అందరికంటే ముందే బిగ్ బాస్ సీజన్ 4 కోసం అలాగే వైల్డ్ డాగ్ సినిమా కోసం బయటకి వచ్చి షూటింగ్ లో పాల్గొన్నాడు. అంతేకాదు 2020 లో పెండింగ్ పడిన ప్రాజెక్స్ట్ అన్ని బిగ్ బాస్ తర్వాత సెట్స్ మీదకి తేలబోతున్నాడని సమాచారం. ఇక యంగ్ హీరోల కంటే దూకుడుగా 2021 లో తన స్టామినా చూపించ బోతున్నాడట.

ఇప్పటికే యంగ్ హీరోలు 2021 లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. నాని, శర్వానంద్ లాంటి వాళ్ల నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్స్ కూడా 2021 లో కనీసం రెండు .. మూడు సినిమాలు విడుదల అయ్యేలా చూసుకుంటున్నారు. అయితే సీనియర్ స్టార్ హీరో నాగార్జున కూడా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా కంప్లీట్ చేశాడు. అలాగే బాలీవుడ్ సినిమా కూడా కంప్లీట్ చేసినట్టు సమాచారం. మరో వైపు ప్రవీణ్ సత్తారు తో నాగార్జున ఒక సినిమా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. మరో వైపు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమాను కూడా డిసెంబర్ నుంచి మొదలవబోతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఖచ్చితంగా ఈ మూడు సినిమాలు 2021 లోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయని సమాచారం.